Bihar:ఫ్రీ కరెంట్..సీఎం నితీశ్ ప్రకటన

9
- Advertisement -

బీహార్ ఎన్నికల వేళ సీఎం నితీశ్ కుమార్ మరో సంచలన ప్రకటన చేశారు. 125 యూనిట్ల లోపు కరెంట్ బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. జులై బిల్లుల నుంచే ఈ పథకాన్ని అమలు చేస్తామని నితీశ్ కుమార్ ఎక్స్ వేదికగా తెలిపారు.

మొదటి నుంచి అందరికీ చౌక ధరలకు విద్యుత్ అందిస్తున్నాము. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ నుంచి.. అంటే జూలై నెల బిల్లు నుండి రాష్ట్రంలోని అన్ని గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు విద్యుత్ కోసం ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్లు వెల్లడించారు.

దీని వల్ల రాష్ట్రంలోని 1కోటి 67లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. రాబోయే మూడేళ్లలో కుటీర్ జ్యోతి పథకం కింద ఈ గృహ వినియోగదారుల నుంచి అనుమతి తీసుకొని వారి ఇళ్ల పైకప్పులపై లేదా సమీపంలోని స్థలంలో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇప్పటికే నితీశ్ కుమార్…ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read:గోదావరి నీళ్లు..రేవంత్ అబ్బ సొత్తు కాదు!

- Advertisement -