బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. శాసనమండలి సమావేశాల సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ఉద్దేశించి నితీశ్ ‘యే లడ్కీ’ అని సంబోధించడం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. సభలో ఈ వ్యాఖ్యలు వెలువడగానే ఆర్జేడీ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
హిళా నాయకురాలిని, అదీ మాజీ సీఎంను ఇలా సంబోధించడం అనుచితమని వారు మండిపడ్డారు.నితీశ్ వ్యాఖ్యలు మహిళల పట్ల అవమానకరంగా ఉన్నాయని, ఇది ఆయనకు కొత్త కాదని ఆర్జేడీ నేతలు విమర్శిస్తున్నారు. గతంలో కూడా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన చరిత్ర నితీశ్‌కు ఉందని గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలని, ముఖ్యంగా మహిళల విషయంలో గౌరవం పాటించాల్సిన అవసరం ఉందని ఆర్జేడీ స్పష్టం చేసింది.
Also Read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్
ఈ వ్యాఖ్యలపై బీహార్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మహిళా సంఘాలు కూడా నితీశ్ వ్యాఖ్యలను ఖండిస్తూ స్పందించే అవకాశముంది. మరోవైపు, అధికార వర్గాలు మాత్రం ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఉద్దేశపూర్వక అవమానం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి.

