జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు తర్వాత సంతోషంగా కనిపించలేదని, బలవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఫీల్ అయ్యారని బీహార్‌కు చెందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన నితీశ్ కుమార్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి మద్దతుతో మరోసారి సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, 2015 కూటమి ప్రభుత్వం , ప్రస్తుత మహాకూటమి ప్రభుత్వం పూర్తిగా వేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2015 కూటమి ప్రభుత్వం రాజకీయ స్వభావంతో కూడుకున్నదని, 2022 మహాకూటమిలో పరిపాలన దృక్కోణం ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉందన్నారు. కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లుగా నితీష్ కుమార్ చెప్పారని, దీంతో బీహార్ ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేరుస్తారన్నారు. బీహార్ రాజకీయాల్లో స్థిరత్వం తిరిగి నెలకొంటుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. బీహార్‌లో ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడైన తేజస్వి యాదవ్ కొత్త ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తారని అంచనా వేశారు.
నితీశ్ ఇప్పుడే సంతోషంగా ఉన్నారు : ప్రశాంత్ కిషోర్
- Advertisement -
- Advertisement -