జగన్‌కు బిగ్ షాక్..వెంకటరావు రాజీనామా

17
- Advertisement -

వైసీపీ అధినేత జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖకు చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకటరావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. వెంకటరావు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీలో పనిచేశారు జగన్. 2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. వైఎస్‌ఆర్‌సీపీకి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు చేతిలో ఓడిపోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన భార్య.. వీకేపీసీపీసీఐఆర్‌యూడీఏ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

Also Read:ఒకే ఏడాదిలో దెబ్బతీశారు: హరీష్‌ రావు

ఆ తర్వాత చొక్కాకుల అదే సంస్థకు ఛైర్మన్‌గా పనిచేశారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తుండగా ఆయన టీడీపీలో లేదా జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -