BB6..డే27 హైలైట్స్

139
bb6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 27 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు టిప్పు ఇచ్చి మరి క్లాస్ పీకారు. ఈ వారం కెప్టెన్ అయిన కీర్తిని అభినందించారు నాగ్. సూర్య ఫుడ్‌ పడేయడంతో గట్టిగానే ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్‌గా ఆదిరెడ్డి విఫలమయ్యాడు అని క్లాస్ పీకగా ఆరోహికి, సూర్యకి లవర్స్ ఉన్నారు బయట అని చెప్పారు.

ఇక రేవంత్ ఆటని మరింత మెరుగుపర్చుకోవాలని వెయ్యి రూపాయల టిప్‌ ఇచ్చి రేవంత్‌ భార్య సీమంతం వీడియోని చూపించడంతో రేవంత్ ఎమోషనల్ అయ్యారు. ఈ సమయంలో గీతూ మళ్ళీ ఓవరాక్షన్ చేయడంతో ఇంటి సభ్యులు తట్టుకోలేకపోయారు. మిగిలిన వాళ్ళ తప్పొప్పుల గురించి కూడా చెప్పారు. ఆదిరెడ్డి, బాలాదిత్య, ఇనయ, చంటిలకు మాత్రం టిప్పు ఇవ్వలేదు.

ఈ సీజన్‌ మొత్తం కెప్టెన్‌ కాకుండా చేసే పనిష్‌మెంట్‌ ఇవ్వమనడంతో ఇంటి సభ్యులంతా కలిసి చంటిని డిసైడ్ చేయడంతో చంటి ఈ సీజన్ కెప్టెన్ అయ్యే అర్హత కోల్పోయాడు. ఇక ఈ వారం ఎవరూ ఎలిమినేట్ అవుతారనేది ఇవాళ తెలియనుంది.

- Advertisement -