Bigg Boss Telugu 8 Day 5: ప్రేరణకు సారీ చెప్పిన ఆదిత్య, గోల్ కొట్టు ఛాలెంజ్ గెలిచిన యష్మీ టీం

5
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 వీకెండ్‌కు వచ్చేసింది. ఈ వారం ఎలిమినేషన్‌కు ఆరుగురు నామినేట్ కాగా ఎవరు ఇంటి నుండి బయటకు వస్తారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక తొలివారం నిఖిల్, నైనికా మరియు యష్మీ గౌడ బిగ్ బాస్ హౌస్ చీఫ్‌లుగా మారారు.

ఇక గురువారం పలు టాస్క్‌లు ఇచ్చారు బిగ్ బాస్. నిఖిల్‌కి వంశధార టాస్క్‌లో భాగంగా ‘గోల్ కొట్టు’ అనే ఛాలెంజ్ జరుగగా యష్మీ టీం గెలిచింది. ప్రేరణ టవాల్ ఉపయోగించినందుకు ఆమెకు క్షమాపణ చెప్పారు ఆదిత్య ఓం. తన టవాల్ ఎలా వాడుతారని గొడవ పడగా క్షమాపణ చెప్పారు ఆదిత్య,. ఆ తర్వాత బిగ్ బాస్ ప్రేరణకు కొత్త టవాల్ పంపారు.

తర్వాత నిఖిల్ తన టీంలో మణికంఠ, విష్ణుప్రియను ఎందుకు ఎంచుకున్నాడో చెప్పాడు. ఆ తర్వాత నిఖిల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ లు మాట్లాడుకుంటూ కనిపిస్తుండగా, మణికంఠను ఎంపిక చేసుకున్నప్పుడు తనని ఎందుకు ఎంచుకోలేదని విష్ణుప్రియ… నిఖిల్‌ను ప్రశ్నిస్తుంది. దీనికి నిఖిల్ సమాధానం చెబుతూ..నాగ మణికంఠను ఎవరూ ఎంపిక చేయరని అందుకే తాను తీసుకున్నట్లు తెలిపారు.

ఆ తర్వాత ప్రేరణ..యష్మీని, ఆదిత్య ఓం …నైనికాను, నిఖిల్… మణికంఠను,విష్ణుప్రియను నైనిక ఎంపిక చేసింది. యష్మీ గౌడతో పాటు అభయ్‌ని నిఖిల్ ఆహ్వానించాడు. ఆ తర్వాత ఇంటి సభ్యుల మద్దతు సంపాదించాలని బిగ్ బాస్ చీఫ్‌లను కోరారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని ‘మైండ్ బ్లాక్’ పాటకు నిద్రలేచి డ్యాన్స్ చేశారు.

Also Read:Bigg Boss Telugu 8 Day 3: నామినేషన్స్‌లో ఆరుగురు.ఏడ్చేసిన మణికంఠ

- Advertisement -