Bigg Boss 8 Telugu Day 1:ఈ సీజన్‌లో కెప్టెన్‌లు ఉండరు..అంతా చీఫ్‌లే!

14
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 తొలి రోజే కంటెస్టెంట్ల మధ్య గొడవలు రచ్చకెక్కాయి. ప్రస్తుతం హౌస్‌లో 14 మంది కంటెస్టెంట్లు ఉండగా ఆరుగురికి రెండు టాస్క్‌లు ఇచ్చారు బిగ్ బాస్. ఈ ఆరుగురిలో ముగ్గురు చీఫ్‍లుగా ఎంపికకాగా మూడో చీఫ్ ఎంపిక రచ్చరచ్చగా మారింది.

తొలుత గ్రాండ్‍ లాంచ్‍లో ఒకరిని ఎలిమినేట్ చేయాలంటే ఐదుగురు నాగ మణికంఠ పేరు చెప్పారు. అయితే, అది ప్రాంక్ అని తేలింది. ఆ తర్వాత నిఖిల్, మణికంఠ మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఇంట్లోని వారంత పనులను పంచుకున్నారు. కిచెన్‍లో కుక్కర్ సమస్య గురించి సోనియా , బెజవాడ బేబక్క మధ్య వాగ్వాదం జరిగింది. ఇక నారింజ పండ్ల ఆట మధ్యలో సోనియా, ఆర్జే శేఖర్ బాషా మధ్య గొడవ జరిగింది. ఆడిన వాళ్లు పండ్లు తినడానికి వీల్లేదని, ఫుడ్‍ను అగౌరపరిచారని సోనియా అనగా దీనికి కౌంటర్‌గా వాదించారు శేఖర్.

ఈ సీజన్‌లో కెప్టెన్‌లు ఉండరు చీఫ్‌లు ఉంటారని బిగ్ బాస్ చెప్పారు. ఇందులో భాగంగా తొలి టాస్క్ పట్టుకొని ఉండండి.. వదలకండి ఇచ్చారు. యష్మీ గౌడ, నిఖిల్, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, నైనిక, నబీల్ అఫ్రిది చీఫ్‍ అయ్యేందుకు అసలైన తొలి టాస్కులో పోటీ పడొచ్చని చెప్పారు. జోడీగా కాకుండా ఎవరికి వారు పోటీపడాలని చెప్పారు. ఈ గేమ్‍కు సంచాలకుడిగా అభయ్ నవీన్ వ్యవహరించారు.

Also Read:Bigg Boss Telugu 8 : ఈసారి కంటెస్టెంట్స్ 14 మంది

ఓ బోనులో రంగుల తాళ్లను ఎక్కువ సేపు పట్టుకున్న వాళ్లు విన్నర్ అని బిగ్‍బాస్ చెప్పారు. స్పిన్నింగ్ వీల్‍లో వచ్చిన కలర్స్ తెంపడం, దాన్ని బట్టి కంటెస్టెంట్లు వేరే కలర్ తాడును పట్టుకోవడం లాంటి రూల్స్ చెప్పారు. ఈ టాస్కులో నిఖిల్ గెలిచి ఈ సీజన్‍లో ఫస్ట్ చీఫ్ అయ్యారు.తర్వాత రెండో టాస్క్‌లో కోన్‍లను కాళ్ల మధ్యలో పెట్టుకొని గెంతుతూ ఎండ్ లైన్‍ వద్ద ఎనిమిదో కోన్లతో ముందుగా టవర్ నిర్మించిన వారు విన్నర్ అని ప్రకటించారు బిగ్ బాస్. ఈ టాస్కులో గెలిచిన నైనిక రెండో చీఫ్ అయ్యారు.

ఇక మూడో చీఫ్ కోసం ఓ ట్విస్ట్ పెట్టారు బిగ్ బాస్. బేబక్క, శేఖర్, నబిల్, యష్మి గౌడకు టాస్క్ ఇవ్వకుండ ఇప్పటికే చీఫ్‍లు అయిన నిఖిల్, నైనిక మాట్లాడుకొని ఆ నలుగురిలో ఒకరిని ఎంపిక చేయాలని చెప్పారు. దీంతో నిఖిల్, నైనిక యష్మి గౌడను మూడో చీఫ్‍గా ఎంపిక చేశారు. ఈ క్రమంలో గొడవ రచ్చరచ్చగా మారింది. తనను ఎందుకు ఎంపిక చేయలేదని గొడవకు దిగాడు నబీల్. మొత్తంగా మూడో చీఫ్ సెలెక్షన్ విషయంలో బిగ్‍బాస్ పెట్టిన మెలికతో కంటెస్టెంట్ల మధ్య విబేధాలు రాగా ఇది ఎక్కడికి దారి తీస్తుందో వేచిచూడాలి.

- Advertisement -