Bigg Boss Telugu 8: కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

5
- Advertisement -

ఈసారి భారీ ట్విస్ట్‌లతో బిగ్ బాస్ తెలుగు 8 ఉండనుందని తెలుస్తోండగా 14 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లారు. ఇక వీరి రెమ్యునరేషన్‌కి సంబంధించి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి చెప్పిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

యాంకర్ విష్ణుప్రియకు అత్యధికంగా వారానికి రూ.4లక్షలు ఇస్తున్నారని మిగితా వారికి ఒక్కో వారానికి నాగ మణికంఠకు రూ.1.20లక్షలు,పృథ్విరాజ్‌కు రూ.1.50లక్షలు,సోనియా ఆకుల – రూ.1.50లక్షలు,బెజవాడ బేబక్క – రూ.1.50లక్షలు,నబీల్ ఆఫ్రిది – రూ.2లక్షలు,కిర్రాక్ సీత – రూ.2లక్షలు,ప్రేరణ – రూ.2లక్షలు,
అభయ్ నవీన్ – రూ.2లక్షలు,నైనిక – రూ.2.20లక్షలు,నిఖిల్ – రూ.2.25లక్షలు,శేఖర్ బాషా – రూ.2.50లక్షలు,యష్మి గౌడ – రూ.2.50లక్షలు,ఆదిత్య ఓం – రూ.3లక్షలు ఇస్తున్నారని వెల్లడించారు ఆదిరెడ్డి.

తొలి వారం మొత్తం ముందుగానే కంటెస్టెంట్లకు ఇస్తారని ..ఆ తర్వాత మొత్తం వారాలకు లెక్కేసి కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ అందజేస్తారని చెప్పారు. ఎలిమినేట్ అయ్యాక 80 శాతం మొత్తాన్ని నెలలోపు, మిగిలిన 20 శాతాన్ని తొమ్మిది నెలల తర్వాత నిర్వాహకులు ఇస్తారని తెలిపారు.

Also Read:Bigg Boss 8 Telugu Day 1:ఈ సీజన్‌లో కెప్టెన్‌లు ఉండరు..అంతా చీఫ్‌లే!

- Advertisement -