బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తయింది. తొలి వారం ఎలిమినేషన్‌లో ఆరుగురు ఉండగా ఇందులో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. విష్ణుప్రియ, పృథ్వీరాజ్, సోనియా , మణికంఠ, శేఖర్ భాషా, బేబక్క ఉండగా ప్రేక్షకుల నుండి తక్కువ ఓట్లు వచ్చిన బేబక్క ఎలిమినేట్ అయ్యారు.
హౌస్ నుండి బయటకు వస్తానని ఉహించలేదని, ఇంకా అవకాశం ఇస్తే బాగా ఆడి తనని తాను నిరూపించుకునే దానినన్నారు. ఎలిమినేట్ అయినందుకు చాలా బాధగా ఉందన్నారు. అయితే బిగ్ బాస్‌లో చిన్న ప్రయాణమైన బాగుందని తెలిపారు. ప్రస్తుతం హౌస్‌లో ఉండటానికి అర్హత లేని వారు ఎవరో చెప్పాలన్నారు నాగ్.
సోనియా ప్రతి విషయంలోనూ ఓ నెగటివ్ వైబ్ కనిపించిందన్నారు. తనకి నేను నచ్చలేదని అర్థమైందనన్నారు.ఫృథ్వీరాజ్..కోపాన్ని నియంత్రించుకోలేని తత్వం ఉందని,మా ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఒక తమ్ముడిలా భావించి క్షమించానన్నారు. మణికంఠ హౌస్‌లో ఒంటరిగా ఉన్నాడు ఆందోళన పడుతున్నాడన్నారు. బేబక్క ఎలిమినేట్ కావడంతో హౌస్ లో 13 మంది సభ్యులు ఉంటారు.
Also Read:Harishrao: రైతు ఆత్మహత్య బాధాకరం