BB6…ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో?

231
Nag
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా సాగుతోంది. 41 రోజులు పూర్తి చేసుకోగా ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారోనన్న అందరిలో ఆసక్తిలో నెలకొంది. ఈ వారం ఎలిమినేషన్ లో శ్రీసత్య, శ్రీహాన్, అర్జున్, గీతూ, వాసంతి, బాలాదిత్య, కీర్తి, సుదీప ఉండగా మొదట శ్రీసత్యను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశారు.

ఇక అంతకముందు వీకెండ్ ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఎపిసోడ్ ఆధ్యాంతం ఆసక్తికరంగా మారింది. రోహిత్ తాను రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ అయి పెద్ద త్యాగం చేయగా దానిని వీడియోలో చూపించారు నాగ్. రోహిత్ కోసం ఎవరు త్యాగం చేస్తారు అని బిగ్‌బాస్ అడిగినప్పుడు అందరూ ఓకే అన్నారు. కానీ సాయం చేసే టైంకి అందరూ కలిసి వాసంతిని డిసైడ్ చేశారు అని తెలిపారు నాగ్. ఇక బిగ్‌బాస్ ఆదేశం ప్రకారం వాసంతి తన జుట్టును భుజాల వరకూ కట్ చేసుకొని, తన ఇష్టప్రకారమే ఈ పని చేస్తున్నాను అని చెప్పింది.

తర్వాత ఇంటి సభ్యులతో గేమ్స్ ఆడించారు నాగార్జున. కొంతసేపటికి కొంతమందిని ప్రత్యేక గదిలోకి పిలిపించి మాట్లాడారు నాగ్‌. ఈ క్రమంలో బాలాదిత్యను పిలిచి గీతూ తనని ఎలా మోసం చేసిందో చూపెట్టడంతో బాలాదిత్య ఆశ్చర్యపోయారు. తర్వాత నాగార్జున కంటెస్టెంట్స్ కి గుడ్, యావరేజ్, డెడ్ అని ట్యాగ్స్ ఇచ్చాడు. ఇందులో భాగంగా సూర్య, ఫైమా, రేవంత్‌, శ్రీసత్య, శ్రీహాన్‌, రోహిత్‌ బాగా ఆడారని చెప్పి వాళ్లకి గుడ్ ట్యాగ్ ఇచ్చారు. బాలాదిత్య, రాజ్‌, అర్జున్, కీర్తి, వాసంతి, సుదీప, మెరీనా, ఆదిరెడ్డికి యావరేజ్‌ ట్యాగ్ ఇచ్చారు. ఇక మిగిలిన వాళ్లకి బ్యాడ్ ట్యాగ్ ఇచ్చారు.

- Advertisement -