బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 81 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్లో భాగంగా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్‌ని హౌస్‌లోకి పంపించగా హౌస్ కళకళలాడింది. తొలుత శ్రీహాన్ లవర్ సిరి హౌస్ లోకి వచ్చింది. శ్రీహన్ ఎమోషనల్ అయి సిరిని గట్టిగా హగ్ చేసుకున్నాడు. సిరి తన మెడపై వేసుకున్న శ్రీహాన్ నేమ్ టాటూని చూపించడంతో శ్రీహాన్ ఏడ్చేశాడు. తర్వాత ఇద్దరూ కలిసి లవ్ మెలోడీ సాంగ్స్ కి స్టెప్పులేశారు.
కీర్తికి ఎవరూ లేకపోవడంతో తన కోసం ఎవరు రారని, వచ్చే వాళ్ళందరిని చూస్తూ బాధపడింది. అయితే కీర్తి కోసం తన ఫ్రెండ్, సీరియల్ నటుడు మహేష్ రావడంతో కీర్తి చాలా ఎమోషనల్ అయింది. తర్వాత ఇనయా కోసం ఆమె తల్లి రాగా ఏడుపు ఆపుకోలేకపోయింది. ఇనయా తండ్రి చనిపోవడం, ఇంటిని వదిలేసి ఇనయా సినీ పరిశ్రమకి రావడంతో తల్లితో కూడా మాటలు బంద్ అయ్యాయి. తాజాగా ఆమె తల్లి రావడంతో ఏడుపు ఆపుకోలేకపోయింది.
నాకోసం ఇంత బాధపడుతున్నావని తెలీదు. నువ్వు చాలా కష్టపడ్డావు, ఇక్కడిదాకా వచ్చావు. బిగ్‌బాస్ గెలిచి బయటకి రా అని మోటివేట్ చేసింది. బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదాం అని తల్లితో అడగగా ముందు ఈ గేమ్ అవ్వనివ్వు అని చెప్పింది. గురువారం ఎపిసోడ్‌తో హౌస్మేట్స్ అందరి వాళ్లు వచ్చి వారిలో జోష్ నింపారు.
ఇవి కూడా చదవండి..