బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 11 వారాల్లోకి ఎంటరైంది. 11 వారంలో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది.గత రెండు వారాలుగా నామినేషన్స్ నుండి తప్పించుకుంటున్న శ్రీసత్య..ఈవారం కూడా ఆల్మోస్ట్ తప్పించుకునే పరిస్థితిరాగా కీర్తి దెబ్బకు ఎలిమినేషన్స్‌లో పడింది.
ఈవారంలో కెప్టెన్‌గా ఉన్న ఫైమా తప్ప.. మిగిలిన 9 మంది నామినేషన్స్‌లో ఉండగా.. శ్రీ సత్య 2 శాతం ఓట్లతో అందరికంటే లీస్ట్‌లో ఉంది.దీంతో శ్రీసత్య ఈవారం డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇక ఈవారం ఇమ్యునిటీ అవకాశాన్ని కల్పిస్తూ.. బిగ్ బాస్ బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వగా.. సత్య మిస్టేక్ చేసింది. . ఎవరైనా హయ్యెస్ట్ యూనిక్ వాల్యూ కలిగిన చెక్ రాస్తారో.. వాళ్లు ఈవారం నామినేషన్స్ నుంచి సురక్షితం అవుతారని చెప్పారు. అయితే చెక్‌పై రాసే అమౌంట్‌ని మిగతా ఇంటి సభ్యులలో చర్చించడానికి వీళ్లేదని కండిషన్ పెట్టారు బిగ్ బాస్.
దీనిని అధిగమిస్తూ శ్రీహాన్‌తో గుసగుసలాడుతూ కనిపించింది శ్రీసత్య. దీంతో గేమ్ నుండి డిస్ క్వాలిఫై అయింది శ్రీసత్య.
ఇవి కూడా చదవండి..