బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 78 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. మొహం మీద తిట్టుకోకుండా, కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిని రూమ్ లోకి పిలిచి ఎవరినైతే నామినేట్ చేయాలనుకున్నారో వారి ఫోటోని ముక్కలు చేయమన్నారు బిగ్ బాస్. అయితే ఈ సారి గొడవలు జరగలేదు.
తొలుత రోహిత్.. శ్రీహాన్, ఫైమాలని, శ్రీసత్య.. రాజ్, రోహిత్ లని, రాజ్.. శ్రీహాన్, శ్రీసత్యలని, కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్యలని, ఫైమా.. రోహిత్, ఇనయాలని, శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డిలని, ఇనయ.. ఫైమా, రాజ్ లని, ఆదిరెడ్డి.. ఇనయా, శ్రీహాన్ లని, రేవంత్.. ఫైమా, ఆదిరెడ్డిలని నామినేట్ చేశారు. ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు రేవంత్.
ఇక ఎక్కువ మంది నామినేట్ చేసిన శ్రీహాన్, ఫైమా,రోహిత్, రాజ్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఇనయాలు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలిపారు బిగ్ బాస్.
ఇవి కూడా చదవండి..