ఓటమిని తట్టుకోలేకపోయిన రేవంత్!

94
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 89 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లోనూ టికెట్ టు ఫినాలే టాస్క్ కొనసాగింది. ఇందులో భాగంగా గుడ్డు జాగ్రత్త అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో విజేతగా నిలిచి ఆదిరెడ్డి ఫైనల్‌కు చేరిన తొలి కంటెస్టెంట్‌గా నిలవగా టాస్క్‌లో ఓడిపోయి రేవంత్ సంచాలకులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

గురువారం ఎపిసోడ్‌లో భాగంగా గుడ్డు జాగ్రత్తలో ముగ్గురే పాల్గొనాలని.. ఆ ముగ్గురు ఎవరో ఇంటి సభ్యులే ఏకాభిప్రాయానికి రావాలని బిగ్ బాస్ సూచించారు. దీంతో కాసేపు వాదోపవాదాల అనంతరం రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్‌ ఈ టాస్క్‌లో పాల్గొన్నారు. ముగ్గురు పోటీదారులకు ఫ్లాట్‌గా ఉన్న బేస్‌లను ఇచ్చారు. దాని మీద గుడ్డు పెట్టి.. గుడ్డును పట్టుకోకుండా బేస్‌ను మాత్రమే ఒక చేత్తో పట్టుకుని అడ్డంకులన్నింటినీ దాటుకొని వెళ్లి ఆ గుడ్డును గూడులో వేయాలి. అలా 5 గుడ్లు ఎవరైతే గూడులో ముందుగా వేస్తారో వారికి 3 పాయింట్లు. రెండో స్థానంలో నిలిచిన వారికి 2 పాయింట్లు. మూడో స్థానంలో ఉన్నవారికి ఒక పాయింట్ వస్తుంది.

రేవంత్ బేస్ మీద గుడ్డు పెట్టి అడ్డంకులను దాటుకుంటూ వెళ్లే క్రమంలో తన రెండో చేతిని తరచుగా గుడ్డు దగ్గరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఒకసారి గుడ్డును పట్టేసుకున్నాడు. దీన్ని గమనించిన కీర్తి.. రేవంత్ గుడ్డు పట్టుకున్నాడు అని చెప్పింది. తప్పును ఒప్పుకోలేదు రేవంత్. అయితే ఆదిరెడ్డి మాత్రం తెలివిగా ఆడుతూ అన్ని గుడ్లను గూడులో వేసుకుంటూ వచ్చి టాప్‌గా నిలవగా రెండో స్ధానంలో రోహిత్, మూడో స్థానంలో రేవంత్ నిలిచారు. దీంతో తన ఓటమిని తట్టుకోలేక సంచాలకులపై అసహనాన్ని వ్యక్తం చేసి ప్రేక్షకుల ముందు మరింతగా దిగజారారు రేవంత్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -