బిగ్‌బాస్‌ 5: ఈ వీకెండ్‌ హౌస్‌లో ఫుల్‌ జోష్‌..

135
- Advertisement -

ఇంటిసభ్యుల ఆటపాటలతో బిగ్‌బాస్‌ హౌస్‌ ఈ వీకెండ్‌ ఫుల్‌ జోష్‌తో నిండిపోయింది. నాగార్జున ఇచ్చిన స్పెషల్‌ టాస్క్‌లతో ఎలిమినేషన్‌ని మర్చిపోయి.. ఇంటిసభ్యులు కాస్త సేద తీరారు. ఇందులో భాగంగా ఇంటిసభ్యులతో నాగార్జున ‘‘నేను ఎవర్ని’’ అనే ఆట ఆడించారు. ఇంటిసభ్యులందరి పేర్లను చీటీల్లో రాసి.. ఓ గ్లాస్‌ బౌల్‌లో వేశారు. ప్రతి ఒక్క హౌస్‌మేట్‌.. అందులోని ఒక చీటీని తీసి.. ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్లని ఇమిటేట్‌ చేసి చూపించాలి. అలా, శ్రీరామ్‌కు సన్నీ పేరు రావడంతో అతడిని ఇమిటేట్‌ చేయగానే.. మిగిలిన ఇంటిసభ్యులు గుర్తించారు. ఇక, కాజల్‌ ఎలా తింటుందో చూపించిన రవి.. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అందర్నీ నవ్వించాడు. మరి, ఎంతో సరదాగా సాగుతున్న ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేటై బయటకు వచ్చేది ఎవరో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

- Advertisement -