బిగ్ బాస్ 5 షురూ..

31
bb5

బిగ్ బాస్ సీజన్ 5 వచ్చేసింది. ఈరోజు (సెప్టెంబర్ 5) సాయత్రం 6 గంటల నుంచి సీజన్ 5 స్టార్ మా ఛానల్‌లో అంగరంగవైభవంగా ప్రసారం అవుతుంది. మూడు నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేయబోతున్నారు. ఆయనకు ఇది ముచ్చటగా సీజన్ సీజన్ కావడం విశేషం. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఓ పండగలా, ఓ ఉత్సవంలా ప్రారంభమైంది. ఇక అక్కడినుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకి.. శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అవుతుంది.

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు చూడనంత స్థాయిని “బిగ్ బాస్” పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో లక్షల కుటుంబాల్ని టీవీ ముందు కట్టి పడేసిన ఆ సెన్సషనల్ షో ఎన్నో లైవ్ ఎమోషన్స్ ని చూపించింది. షో లో నిలవడానికి గెలవడానికి ఎవరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో కళ్ళకు కట్టింది. రకరకాల మనస్తత్వాలు వున్న హౌస్ మేట్స్ ని కింగ్ నాగార్జున ఎలా డీల్ చేసారో మనం చూసాం. ఇప్పుడు హౌస్ లోకి ఎవరు వస్తారో, ఎవరు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో.. చూడాలి. మరి ఈ సీజన్ 5 లో సుమారు వంద రోజుల ఈ ప్రయాణానికి సెప్టెంబర్ 5న తెర లేచింది.

కంటెస్టెంట్స్ ఎవరన్న విషయానికి వస్తే.. మొత్తం 19 మంది ఈ సీజన్‌లో ఉండబోతున్నారనేది సమాచారం. ప్రారంభం రోజున 16 మంది కంటెస్టెంట్స్‌ హౌస్‌లోకి వెళ్తుండగా.. మిగిలిన ముగ్గురూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే చాలామంది పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో ఎవరు ఉంటారు? ఎవరు వెళ్తారనే సస్పెన్స్‌ మరి కొన్ని గంటల్లో వీడనుంది.. అయితే ఈ 17 మంది కంటెస్టెంట్స్ కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది.

– యాంకర్ రవి
– షణ్ముఖ్ జస్వంత్
– వీజే సన్నీ
– మానస్ నాగులపల్లి
– కార్తీకదీపం ఉమాదేవి (భాగ్య)
– ఆర్జే కాజల్
– శైలజా ప్రియ
– శ్రీరామ్ చంద్ర
– సరయు రాయ్
– ఆనీ మాస్టర్
– నటరాజ్ మాస్టర్
– శ్వేతా వర్మ
– లహరి
– లోబో
– సిరి హన్మంత్
– జబర్దస్త్ ప్రియాంక (సాయి తేజ)
– విశ్వ

Get ready for 5-much entertainment...Kick tonnullo untundi #BiggBossTelugu5 starting today at 6 PM