బుల్లితెర పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కంటెస్టెంట్‌లు క్వారంటైన్‌లో ఉండగా త్వరలోనే రెండో ప్రొమోను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు.
ఈసారి హౌస్‌లోకి షణ్ముఖ జశ్వంత్,యాంకర్ రవి, ప్రియా, ఆర్జే కాజల్, యాంకర్ లోబో, లహరి,సరయూ,మానస్,వీజే సన్నీ,అనీ మాస్టర్ అడుగుపెట్టబోతుండగా వీరంత క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ఇంతలోనే బ్రేకింగ్ న్యూస్ లాంటి వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్‌లో ఉన్న ఓ కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్‌గా తేలిందని వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో క్వారంటైన్‌లో ఉన్నవారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.అయితే దీనిపై నిర్వాహకులు మాత్రం అఫిషియల్‌గా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక గత సీజన్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున ఈసారి కూడా ప్రేక్షకులను అలరించనుండగా ఈసారి షోను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారట నిర్వాహకులు.