బిగ్‌బాస్ హౌస్‌లో హోటల్ టాస్క్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య డీల్స్, స్టార్‌ల కోసం గొడవలు, వ్యూహాలు కొనసాగుతున్నాయి. ముందుగా రోహిత్ ముకేశ్ టీంలో కలిసిపోయాడు. వర్షిణితో మాట్లాడుతూ.. నీకు స్టార్ ఇప్పిస్తానని, వంశీని ఓడించేలా తనకు డబ్బులు ఇవ్వాలని డీల్ మాట్లాడతాడు. మరోవైపు త్రిగుణ్‌తో డీల్స్ పెట్టుకుంటే సపోర్ట్ చేయనని, వార్ వన్‌సైడ్ చేస్తానని హెచ్చరిస్తాడు. అయితే ముకేశ్ ఎవరికీ స్టార్లు, డబ్బులు ఇవ్వడం లేదని త్రిగుణ్ వర్షిణితో అంటాడు. దీనికి వర్షిణి బదులిస్తూ ముకేశ్ చాలామందికి డబ్బులు ఇచ్చాడని సమర్థిస్తుంది. చివరకు రోహిత్ తన స్టార్‌ను అమన్‌కు రూ.2 వేలకు అమ్మేస్తాడు.
ఇక వంశీ ఇంటి సభ్యులతో కసరత్తులు చేయిస్తూ కామెడీ పండిస్తాడు. లచ్చిమి వేషంలో నటిస్తూ నవ్విస్తాడు. రాంప్రసాద్, నరేశ్ కూడా అతనితో కలిసి సందడి చేస్తారు. మరోవైపు శివ దగ్గర రాంప్రసాద్ గురించి, వర్షిణి, ముకేశ్ మధ్య జరుగుతున్న ప్లాన్ల గురించి చర్చ జరుగుతుంది. ముకేశ్‌ను వర్షిణి గ్రీన్ టీమ్‌లోకి, రోహిత్‌ను ఎల్లో టీమ్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని శివ చెబుతాడు.
తర్వాత బిగ్‌బాస్ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఛాలెంజ్ ప్రకటిస్తారు. శివ, రాంప్రసాద్ టీమ్‌లుగా ఏర్పడి పోటీ పడతారు. గెస్టులుగా ఉన్న సభ్యులు డైస్ వేయగా ఓనర్లు పెద్ద డైస్‌ను కదిలిస్తూ సరైన నంబర్ వచ్చేలా చేయాలి. మధ్యలో వచ్చే టాస్క్‌లను పిక్కలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో వంశీ తన కామెడీతో అందరినీ నవ్విస్తాడు. రామకృష్ణకు ఇచ్చిన మేకప్ టాస్క్‌లో అమన్‌కు వేసిన మేకప్ హైలైట్‌గా నిలుస్తుంది.
Also Read:ఫోన్లు పక్కన పెట్టండి..కొత్త ట్రెండ్!
చివర్లో బిగ్‌బాస్ ఫైనల్ డీల్స్‌కు అవకాశం ఇస్తారు. రాంప్రసాద్ ఏడు పింక్ స్టార్లు, ఒక గోల్డ్ స్టార్ సాధించగా.. వర్షిణి మూడు పింక్ స్టార్లు, ఒక గోల్డ్ స్టార్ దక్కించుకుంటుంది. దీంతో వీరిద్దరూ గ్రీన్ లెవల్‌కు చేరుకొని గోట్స్‌గా నిలిచి నామినేషన్ల నుంచి సేవ్ అవుతారు. వంశీ మాత్రం రెడ్ నుంచి ఎల్లో లెవల్‌కు చేరడంతో డేంజర్‌లో పడతాడు. స్టార్‌ల లెక్కలు, టీమ్ వ్యూహాలతో తాజా ఎపిసోడ్ ముగిసింది.

