బిగ్ బాస్ ఇంట్లో రెండో వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ పీకారు. వారం మొత్తం ఆటల్లో పాల్గొన్న తీరు, చేసిన పొరపాట్లను ఎండగడుతూ పలువురికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కృష్ణుడు, శ్రష్టి ఈ వారం అసలు ఎక్కడా కనిపించలేదని నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ చూస్తున్న ఆడియెన్స్‌లా ఉన్నారంటూ వారిని మూలకు వెళ్లి కూర్చోవాలని దూరంగా పెట్టారు.
ముఖేష్‌కు అనుకూలంగా వర్షిణి సంచాలక్‌గా వ్యవహరించిందని నాగ్ నిలదీశారు. ప్రేక్షకులు కూడా వర్షిణి ఫెయిల్ అయ్యారని తెలపడంతో, ఈ సీజన్ పూర్తయ్యే వరకు ఆమెకు ఇకపై సంచాలక్ పదవి ఇచ్చేదే లేదని నాగ్ కఠిన శిక్ష విధించారు.
షాలినీ అతిగా కోపపడటం, అమన్ చెబుతున్నప్పుడు మధ్యలోకి దూరడం, ఇతరులపైకి అనవసరంగా దూసుకెళ్లడాన్ని నాగ్ తీవ్రంగా తప్పుబట్టారు. యాంగర్ మేనేజ్మెంట్ అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. ఇక ఫిజికల్ టాస్క్‌ల్లో ఇతరులను ఎత్తిపడేస్తూ ట్రిగ్గర్ అవుతున్న రోహిత్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ, మైండ్ పెట్టి ఆడాలని సలహా ఇచ్చారు.
ఇంట్లో అందరూ నిద్రపోతుండటంతో, ఇకపై పగటిపూట ఎవరూ బెడ్ రూమ్‌లోకి వెళ్లకూడదని, బెడ్డుపై పడుకోకూడదని నాగ్ పనిష్మెంట్ ఇచ్చారు. అలాగే వంటగదిలో గొడవలు పడుతున్న దేబ్జానీ, వంశీలను మందలిస్తూ ప్రేమగా వంట చేసి వడ్డించాలని చెప్పారు.
Also Read:మిర్జాపూర్ సక్సెస్‌పై సోనాల్
శనివారం నాటి ఎపిసోడ్ ముగిసేసరికి ముఖేష్, షాలినీ, రాం ప్రసాద్, ఝాన్సీ మరియు దేబ్జానీలు ఎలిమినేషన్ ముప్పు నుంచి సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

