గంజాయి కేసులో బిగ్ బాస్ షణ్ముఖ్ అరెస్ట్..

22
- Advertisement -

యూ ట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఓ కేసు విషయంలో షణ్ముఖ్‌ని విచారించేందుకు వెళ్లగా గంజాయి తీసుకుంటూ పట్టుబడటంతో అతడిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

మౌనిక అనే యువతిని మోసం చేసి.. మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌. దీంతో మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసుపై సంపత్ వినయ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు షణ్ముఖ్ ఇంటికి వెళ్లగా.. అక్క‌డ గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డాడు షణ్ముఖ్‌. గతంలో హిట్ అండ్ రన్ కేసులో అరెస్టు అయ్యి విడుదలయ్యాడు.

Also Read:BJP:ఓటమి ఉచ్చులో ఆ ముగ్గురు!

- Advertisement -