BB10:గేమ్ ఛేంజర్‌గా ముకేశ్

4
- Advertisement -

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో కంటెస్టెంట్ల మధ్య సరదా సంభాషణలు, గొడవలు, గేమ్‌లో ఉత్కంఠ కొనసాగుతున్నాయి. తాజా ఎపిసోడ్‌లో నరేశ్ తన కామెడీతో నవ్వులు పూయించగా.. టాస్కుల్లో ముకేశ్, శివ, త్రిగుణ్ సత్తా చాటారు.ముందుగా సుధీర్.. రాంప్రసాద్‌తో మాట్లాడుతూ దేబ్జానీ, ఝాన్సీలను కలపొచ్చు కదా అని సరదాగా అంటాడు. మరోవైపు నరేశ్ కెమెరా ముందు మాట్లాడుతూ.. అభిమానులు తన కోసం ధర్నాలు చేయొద్దని, తాను కచ్చితంగా గెలిచి కప్పు తీసుకొస్తానని సరదాగా చెబుతాడు. అనంతరం వర్షిణితో ఫన్నీగా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తాడు. వర్షిణి తనకు ఐలవ్‌యూ చెప్పలేదని అనగా.. చందమామను చూడాలనుకోవడం తప్పు కాదని, కానీ దాన్ని ఒడిలో పెట్టుకోవాలని అనుకోవద్దంటూ నరేశ్ కామెడీ చేస్తాడు.

ఎల్లో కేటగిరిలో ఉన్న సభ్యులకు బిగ్‌బాస్ ‘గోట్ ఆఫ్ కామన్‌సెన్స్’ టాస్క్ నిర్వహిస్తాడు. ఎల్‌ఈడీపై వచ్చే ప్రశ్నలకు ముందుగా బెల్ కొట్టి సరైన సమాధానం చెప్పిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. ఈ టాస్క్‌లో ముకేశ్ ఏడు పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, త్రిగుణ్ నాలుగు, నరేశ్ రెండు పాయింట్లు సాధించారు. వర్షిణి, రాంప్రసాద్ ఖాతాలో ఒక్క పాయింట్ కూడా పడలేదు. దీంతో ముకేశ్ గోట్‌గా నిలిచి గ్రీన్ కేటగిరిలోకి వెళ్లాడు. వచ్చే వారం నామినేషన్ల నుంచి కూడా అతడికి మినహాయింపు లభించింది.

Also Read:రెగ్యులర్‌ షూటింగ్‌లో ‘శనార్తి’

ఝాన్సీ విషయంలో దేబ్జానీ బాధపడటంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు రాంప్రసాద్, నరేశ్, ముకేశ్ ప్రయత్నిస్తారు. అయితే తాను ఝాన్సీ విషయంలో బాధపడలేదని, నరేశ్, రాంప్రసాద్‌ల విషయంలోనే ఫీలవుతానని దేబ్జానీ స్పష్టం చేస్తుంది. మరోవైపు ఝాన్సీ దేబ్జానీ బెడ్‌ను తీసుకోవడంతో ఇంట్లో ఆసక్తికర పరిస్థితి నెలకొంది.

ఎల్లో కేటగిరిలో మిగిలిన సభ్యులకు గ్రీన్‌లోకి వెళ్లేందుకు చివరి టాస్క్ నిర్వహిస్తారు. వజ్రాల దొంగతనం నేపథ్యంలో జరిగిన ఈ పోటీలో శివ, త్రిగుణ్ విజయం సాధించారు. ఇద్దరిలో గోట్‌ను ఎంపిక చేసే బాధ్యతను బిగ్‌బాస్ వారికే అప్పగించగా, శివ తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ త్రిగుణ్‌ను గోట్‌గా ప్రకటించాడు.

- Advertisement -