పెళ్లి చేసుకుంటున్న బిగ్ బాస్ ప్రేమజంట 

370
bigboss
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో గా బిగ్ బాస్ కు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. మొదట బాలీవుడ్ లో ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలో ప్రసారం అవుతుంది. ఈ షో వల్ల చాలా మంది ఫ్రెండ్స్ గా మారుతున్నారు. మరి కొందరు శత్రువులుగా మారుతున్నారు. అయితే మరికొంత మంది మాత్రం ఈ బిగ్ బాస్ హౌజ్ లో ప్రేమలో పడిపోతున్నారు. ఇక తెలుగులో మూడో సీజన్ లో రాహుల్ , పునర్ణవిల స్నేహం కాస్త ప్రేమగా మారింది. కెమెరాలు ఉన్నాయన్న భయంతో వారు భయటకు చెప్పడం లేదు కానీ వారి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉందని తెలుస్తుంది.

ఇక తాజాగా కన్నడ బిగ్ బాస్ షో లో ఏర్పడి స్నేహం బయటకు వచ్చాక వారిద్దరి ప్రేమ , పెళ్లి వరకు తీసుకెళ్లింది. కన్నడ బిగ్‌బాస్ సీజన్ ఆరులో పాల్గొన్న చందన్ శెట్టి, నివేదితా గౌడల పరిచయం ప్రేమగా మారింది. వీరు బిగ్‌బాస్ సీజన్-6లో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కలిసివచ్చింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వీరి ప్రేమ కొనసాగింది. ఇటీవల దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మైసూరులో ఓ వేదికపై తమ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా చందన్, నివేదితల బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థం ఘనంగా జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటిస్తామని వారిద్దరూ తెలిపారు.

- Advertisement -