తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తంగా 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంటర్ కాగా చివరిగా వచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు యాంకర్ రవి.
అయితే రవికి రాగానే షాకిచ్చారు నాగార్జున. పెళ్లి విషయం నాకు ఇంకా చెప్పలేదంటూ నాగార్జున అనేశారు. సర్ ఆ విషయం మూడేళ్ల క్రితమే అందరికీ చెప్పేశాను అని ఇంకా కొంతమంది నమ్మడం లేదన్నారు. అయితే ఈ క్రమంలో రవికి సర్‌ప్రైజ్ ఇచ్చారు నాగ్. ఆగస్టు 30 నుండి క్వారంటైన్‌లో ఉన్న రవికి ఆయన ముద్దుల కూతురు మెస్సేజ్ పంపించింది. ఆ మెస్సేజ్ విని రవి ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు. ఇక తనకు ఇష్టమైన టాయ్‌ని నాన్నకు గిఫ్ట్‌గా పంపింది రవి కూతురు.
ఈ టాయ్ గురించి హౌస్‌లోకి వెళ్లిన తర్వాత అందరికి చెబుతూ మురిసిపోయారు రవి. కానీ అసలు ట్వీస్ట్ ఇక్కడే ఉంది. గత సీజన్‌లో కూడా అరియానా తనకు ఇష్టమని టాయ్ బిగ్ బాస్ హౌస్‌లోకి తెచ్చుకోగా ఓ టాస్క్‌లో భాగంగా దానిని ఇంటి సభ్యులు పాడు చేయగా అరియానా తెగ బాధడటమే కాదు ఏడ్చేసింది కూడా. ఇప్పుడు కూడా అలాంటి సీనే రీపిట్ కానుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే ఫన్ మాత్రమే కాదు ఎన్నో ఎమోషన్స్‌ల కలయిక. ఫన్నీ టాస్క్‌లే కాదు ఇంటి సభ్యులకు కోపం తెప్పించే పనులు కూడా ఇస్తుంటారు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులకు ఇష్టమైన వాటిని పాడు చేయమని చెబితే వారికిష్టమైన ఆహారం లేదా బట్టలు,షూ ఇలా ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్‌లలో చేశారు కంటెస్టెంట్స్. సో తాజాగా బిగ్ బాస్ 5లో కూడా రవి కూతురు ఎంతో ఇష్టంగా పంపిన టాయ్‌ని ఎవరు చించేసి ఆయన మనసును గాయపెడతారో వేచిచూడాలి.