- Advertisement -
బిగ్ బాస్ ఫేం…యూట్యూబర్ సరయు ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ఓ యాడ్‌లో నటించిందంటూ ఆమెపై కేసు నమోదుకాగా సరయును బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
సరయుతో పాటు ఆమె వీడియో టీం సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్‌లను అరెస్ట్ చేశారు. 7ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్ ఛానెల్లో వీడియో రిలీజ్ చేసింది. ఇది హిందు సమాజాన్ని కించపరిచే విధంగా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు అశోక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా 153A, 295A సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -