ఎన్టీఆరే …. బుల్లితెర బిగ్ బాస్‌

213
Bigg Boss Telugu TRP ratings
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తొలిసారిగా బుల్లితెరపై స్టార్ మాలో అందిస్తున్న అత్యంత భారీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మొదట్లో చాలా డల్ గా నడిచినా క్రమంగా టీ.ఆర్.పీ రేటింగ్ లో రికార్డు సృష్టిస్తున్నది.

Bigg Boss Telugu TRP ratings

పార్టిసిపెంట్ల విషయంలో ముందు ప్రేక్షకుల్లో నిరాశ వ్యక్తమైనా.. వారాంతాల్లో మినహాయిస్తే పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదని.. హౌస్ మేట్స్ అనుకున్నంత స్థాయిలో ఎంటర్టైన్ చేయట్లేదని విమర్శలు వ్యక్తమైనా.. షో రేటింగ్స్ అయితే పడిపోలేదు. రెండో వారంలో కూడా రేటింగ్స్ బాగానే ఉన్నాయి. ‘బిగ్ బాస్’ షో పుణ్యమా అని ‘స్టార్ మా’ ఛానెల్ ఓవరాల్ రేటింగ్స్ పెరిగి.. ఆ ఛానెల్ వరుసగా రెండో వారంలోనూ తెలుగులో నెంబర్ వన్ ఛానెల్ గా కొనసాగడం విశేషం. శని , ఆది వారాల్లో ఎన్టీఆర్ వస్తుండడం తో ఎక్కువగా ఆ రెండు రోజుల్లో జనాలు చూస్తున్నారు..కానీ మిగతా డేస్ లో మాత్రం చాల తక్కువ మంది చూస్తున్నారు.

వీకెండ్స్ తో పాటు సాధారణ రోజుల్లో కూడా బిగ్ బాస్ కు రేటింగ్స్ తెప్పించేందుకు సదరు ఛానల్ యాజమాన్యం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే హాట్ భామ దీక్ష పంత్ ను రంగంలోకి దించింది. ఈ భామ మొదటి రోజే స్విమ్మింగ్ పూల్ లో దిగి హల్ చల్ చేసింది. ఆ తర్వాత ప్రిన్స్ ఆమెకు కిస్ ఇవ్వడం ఇలా హాట్ హాట్ గా షో నడుస్తుంది.రెండో వారంలో మధు ప్రియ ఎలిమినేట్ కావడం.. నాటకీయ రీతిలో సంపూర్ణేష్ బాబు నిష్క్రమించడం.. మరోవైపు దీక్షా పంత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అన్నింటికీ మించి ఎన్టీఆర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వ్యాఖ్యానంతో అదరగొట్టడం ‘బిగ్ బాస్’ షోను వీక్షకులకు చేరువ చేశాయి. ఒక వర్గం ప్రేక్షకులు ఈ షోకు కనెక్టయిపోయి డైలీ ఎపిసోడ్లకు రుచి మరిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఐతే మున్ముందు ఈ షోకు ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుందా అన్నది చూడాలి.

- Advertisement -