నాగార్జున అక్కినేని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 ప్రారంభం నుంచే థీమ్, కంటెస్టెంట్లు, కామనర్స్ ఎంట్రీలతో చర్చకు కేంద్రబిందువైంది.
ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 9 తొలి ఎలిమినేషన్‌తో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. తనూజా గౌడ, జబర్దస్త్ ఇమ్మానుయేల్, ఫ్లోరా సైనీ, డెమన్ పవన్, రాము రాథోడ్, సంజనా గల్రాణి, సుమన్ శెట్టి, తనూజ గౌడ, రితు చౌధరీలతో కలిసి నామినేట్ అయిన శ్రష్టి వర్మ తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అయ్యింది.
మరి ఇప్పుడు రెండో వారం నామినేషన్ టాస్క్‌తో ఇంట్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ వారం ఎలిమినేషన్‌కు డెమన్ పవన్, హరిత హరీస్, భరని కుమార్, ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి, ప్రియా శెట్టి, మనీష్ మర్యాద నామినేట్ అయ్యారు. ఫ్లోరా సైనీ, డెమన్ పవన్ వరుసగా రెండో వారం కూడా నామినేట్ కాగా, కెప్టెన్ సంజనా నేరుగా నామినేట్ చేసిన సుమన్ శెట్టి కూడా జాబితాలో చేరాడు.
తాజా అప్‌డేట్ ప్రకారం సుమన్ శెట్టి అత్యధిక ఓట్లు సాధించి ఈ వారం సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Also Read:‘భద్రకాళి’..నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ!

