బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 17 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందేందుకు బిగ్‌బాస్ ముగ్గురికి అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగా దమ్మ శ్రీజ, రీతూ చౌదరి , ఫ్లోరా సైనిలకి ‘గురితప్పద్దు’ అంటూ ఓ గేమ్ పెట్టాడు. ఇందులో ఇమ్యూనిటీ ఫ్లోరాకి దక్కింది.
ఇమ్యూనిటీ టాస్క్ ‘గురితప్పకు’.. ఈ టాస్కులో గెలవడానికి కేజ్‌లోకి వెళ్లి సంచాలకులు విసిరిన బాల్స్‌ని తీసుకొని బయట నేల మీద ఉన్న తమ బాక్స్‌లో ఉంచాలి.. ఎవరైతే ముందుగా తమకి కేటాయించిన బాస్కెట్‌లో మూడు బాల్స్ వేస్తారో వారు ఈ టాస్క్ విజేతగా నిలిచి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పవర్‌ని పొందుతారు అని చెప్పి సంచాలక్‌గా సంజనని ఎంపిక చేశారు బిగ్ బాస్.
శ్రీజ-రీతూ ఇద్దరూ పోటాపోటిగా ఆడారు. శ్రీజపైకి ఎక్కి.. మెడ పట్టుకొని మరీ డిఫెండ్ చేసింది రీతూ. గేమ్‌లో రీతూ బాగా ఆడింది. అసలు మిగిలిన ఇద్దరికీ ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండ ఇచ్చిపడేసింది. మొదటి బాల్‌ని రీతూ తీసుకొని బయట తన బాక్స్‌లో పెట్టింది. ఇక రెండో బాల్ కోసం రీతూ-శ్రీజ కొట్టుకుంటుంటే మధ్యలో తెలివిగా దూరి ఫ్లోరా పట్టికెళ్లిపోయింది. కానీ ఆ తర్వాత మూడు, నాలుగు బంతులని రీతూ అందుకుంది. ఇలా బాల్స్ అన్నీ పూర్తయ్యసరికి ఫ్లోరా బాక్స్‌లో 3, రీతూ దగ్గర 4, శ్రీజ దగ్గర ఒక బాల్ ఉన్నాయి.
ఇక గేమ్ రూల్ ప్రకారం ప్లేయర్లు తమ దగ్గర ఉన్న బాల్స్‌లో మూడు బంతులని తమ బాస్కెట్లో వేయాలి. అలా ఎవరైతే ముందుగా మూడు బాల్స్ వేస్తారో వాళ్లే విన్నర్. ఈ గేమ్‌లో ఫ్లోరా గెలవడంతో ఇమ్యూనిటీ ఆమెకి దక్కింది.
Also Read:తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరు మార్పు!

