బిగ్ బాస్ 9 తెలుగు 75 రోజులు పూర్తి చేసుకుంటున్న వేళ, ఇమ్మానుయేల్ తల్లి బయటకు వెళ్లిన వెంటనే ఇంటిలో టెన్షన్ పీక్స్‌కి చేరింది. ఈ వారం కెప్టెన్సీ కోసం బిగ్‌బాస్ ఇచ్చిన స్పెషల్ టాస్క్ ప్రకారం ఇంటి సభ్యులు రెండు జట్లుగా విడిపోగా, మిగిలిన ఒకరు రేసు నుంచి తప్పించబడాల్సి వచ్చింది. ఎవరికైతే కెప్టెన్ అయ్యే అర్హత లేదని అనుకుంటున్నారో వారిని రేసు నుంచి తొలగించాలని బిగ్‌బాస్ చెప్పగానే డ్రామా మొదలైంది.
దివ్య ముందుగా నిలబడి తనూజను టార్గెట్ చేస్తూ, ఆమెకు వరుసగా రెండు వారాలు ఇమ్యూనిటీ రావడం వల్ల మళ్లీ కెప్టెన్ ఇవ్వడం సరికాదని చెప్పింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య నెలలుగా నడుస్తున్న కోల్డ్‌వార్ ఒక్కసారిగా బిగ్ ఫైట్‌గా మారింది. అరుపులు, హెచ్చరికలు, వ్యక్తిగత కామెంట్స్—మధ్యలో భరణిని కూడా లాగటానికి ప్రయత్నించగా, ఆయన “నన్ను ఇన్‌వాల్వ్ చేయొద్దు” అంటూ బయటకు వచ్చాడు. పరిస్థితి మరింత అల్లకల్లోలం కావడంతో మిగిలిన హౌస్‌మేట్స్ ఇద్దరినీ పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది.
తర్వాత సంజన కూడా తనూజ పేరే చెబుతూ రేసు నుంచి తప్పించాలన్నారు. సుమన్, ఇమ్ము, డీమాన్, భరణి కూడా తమ ఓట్లు తనూజపైనే వేశారు. చివరికి ఆరు ఓట్ల ఆధారంగా తనూజనే కెప్టెన్సీ రేసు నుంచి తప్పించేశారు. అయితే బిగ్‌బాస్ ఆమెకు ఒక ప్రత్యేక అధికారం ఇచ్చి, మిగిలిన హౌస్‌మేట్స్‌ని రెండు జట్లుగా విభజించే పవర్ ఇచ్చాడు.
తనూజ బ్లూ టీమ్‌గా కళ్యాణ్, డీమాన్, సుమన్, రీతూ; రెడ్ టీమ్‌గా భరణి, దివ్య, సంజన, ఇమ్మానుయేల్‌ని ఎంచుకుంది. తరువాత జరిగిన “హంగ్రీ మాన్‌స్టర్” టాస్క్‌లో చివరకు సుమన్, రీతూ మాత్రమే మిగిలారు. వారిద్దరి మధ్య జరిగిన ఫైనల్ టాస్క్‌ను శనివారం ఎపిసోడ్‌లో చూపించబోతున్నారు. కానీ లీక్ అయిన సమాచారం ప్రకారం సుమన్ గెలిచాడని మొదట ప్రకటించి తర్వాత రీతూకే కెప్టెన్సీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ టాస్క్ సమయంలో కూడా భారీ గొడవ జరిగినట్లు రూమర్స్ ఉన్నాయి.
Also Read:Winter Walk:మీ ఊపిరితిత్తులకు హాని చేస్తోందా?

