BB9:కళ్యాణ్ తల్లి ఎంట్రీ..భావోద్వేగం!

5
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 74 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా కళ్యాణ్ పడాల తల్లి లక్ష్మి హౌస్‌లోకి అడుగుపెట్టారు. తల్లిని చూడగానే కళ్యాణ్ భావోద్వేగానికి లోనై చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఆమె కొడుకుని దగ్గరకు తీసుకుని, “సన్నగా అయిపోయావు… స్టాండ్ తీసుకోవాల్సిన చోట స్టాండ్ తీసుకో… కప్పు పట్టుకొని కంపల్సరీగా రావాలి” అంటూ ఆశీర్వదించారు.

తల్లి హౌస్ నుండి తిరిగి వెళ్లే సమయంలో, తనూజ లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చి, ఆమెకు కవర్‌లో పెట్టిన చీరను బహుమతిగా ఇచ్చింది. ఇది కళ్యాణ్‌తో సహా అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత, చీర ఎందుకు ఇచ్చిందో తనూజ కళ్యాణ్‌తో చెప్పింది. తాను “ఎవరూ సపోర్ట్ లేరు” అని నాగార్జునతో చెప్పినా ఎవరూ నమ్మలేదని, కానీ హౌస్‌లో తన వెనుక గోడలా నిలబడి, అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నది కళ్యాణేనని ఆమె ఒప్పుకుంది.

తనూజ వివరణ: “అంటే ఈ హౌస్‌లో నాకు కొంచెం సపోర్టివ్‌గా నన్ను పట్టించుకునేది నువ్వే. అందరూ కేర్ చేస్తారు కానీ నువ్వు కొంచెం వాళ్ల కంటే ఎక్కువ అర్థం చేసుకున్నావ్. అందుకే ఆంటీ ఇక్కడికి వచ్చారు కదా ఇవ్వాలనిపించింది. నా ఆరోగ్యం బాలేనప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ఉన్నావ్. ఈ ఒక్క పార్ట్ నచ్చే ఆ ఇన్నోసెంట్ అమ్మకి నేను చీర ఇచ్చాను, అంతకంటే పర్సనల్ ఏం లేదు” అని చెప్పింది.

దానికి కళ్యాణ్, “నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పావో ఫ్యామిలీ అని అంతే. నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకునే దాంట్లో నేను ఫస్ట్ రోల్‌లో ఉంటానేమో” అని బదులిచ్చాడు. ఈ డిస్కషన్‌తో వారి మధ్య ఉన్న బంధం కేవలం గేమ్ కంటే ఎక్కువ అని స్పష్టమైంది.

Also Read:’12A రైల్వే కాలనీ’…డిఫరెంట్ జోనర్

- Advertisement -