బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 73 రోజులు పూర్తి చేసుకుంది. ఫ్యామిలీ వీక్‌లో భాగంగా తొలుత హౌస్‌లోకి డీమాన్ తల్లి పద్మ ఎంట్రీ ఇచ్చారు. ఆమె ఎంట్రీ ఇచ్చే సమయానికి డీమాన్‌కి ఫ్రీజ్ అంటూ బిగ్‌బాస్ ఆర్డర్ వేయగా తన బిడ్డని ప్రేమగా చింటూ అంటూ పిలుస్తూ డీమాన్ అమ్మ లోపలికి వచ్చారు. వచ్చీ రావడమే తన కొడుకును గట్టిగా పట్టుకొని ప్రేమగా హత్తుకున్నారు.
డీమాన్‌కి వాళ్ల అమ్మ గారు లడ్డూ తినిపిస్తుంటే ఏంట్రా అది ప్రొటీన్ పౌడరా అంటూ ఇమ్మానుయేల్ కామెడీ చేశాడు. ఇంతలో ఫ్రీజ్‌ల్ ఉన్న అందరినీ రిలీజ్ చేయగానే వచ్చి డీమాన్ తల్లిని పలకరించారు. ఇమ్మూ చెప్పగానే తనూజ మొదలెట్టేసింది. నా వంటకి ఏమైందిరా.. నేను ఎప్పుడూ చేసి పెట్టలేదా అంటూ ఇమ్మూతో అలుగుతూ తనూజ మాట్లాడింది.
ఇంట్లో ఎవరూ నాకు సపోర్ట్ చేయకపోయినా ఆ అమ్మాయి (రీతూ) ఒక్కర్తే చేస్తది.. మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్లని మనమూ బాగా చూసుకోవాలి.. అందుకే ఇక ఆమెతోనే అంతా ఉంటున్నా అని తల్లితో డీమన్ అన్నాడు. తర్వాత హౌస్‌లో ఉన్న బిర్యానీ తీసి తన కొడుకుకి తినిపించారు పద్మ. సపోర్ట్ బానే ఉంది బయట.. నువ్వేం టెన్షన్ పడకు అంటూ చెప్పారు.
Also Read:TG:వాట్సాప్ ద్వారా ‘మీ సేవా’
తర్వాత ఇమ్మానుయేల్ మాట్లాడుతూ పవన్ పెళ్లికి మా అందరినీ తప్పకుండా పిలవండి అంటూ చెప్పాడు. అయ్యో పిలుస్తాం అమ్మా అని ఆమె అన్నారు. తర్వాత గార్డెన్ ఏరియాలో వారసుడు సినిమాలోని అమ్మ మాట వేసి అందర్నీ ఏడిపించాడు బిగ్‌బాస్. కాసేపటి తర్వాత సంజన రెడీ అయి తన ఫ్యామిలీ కోసం ఎదురుచూస్తుండగా పిల్లల్ని తీసుకొని సంజన భర్త హౌస్ లోపలికి వచ్చారు. ఫ్యామిలీని చూసి సంజన ఎమోషనల్ అయిపోయింది. ముఖ్యంగా తన కూతుర్ని చూసి ఇది చూడటానికి నాకులానే ఉందే అంటూ మురిసిపోయింది. తర్వాత తన భర్తతో మాట్లాడుతూ షో ఎలా ఉంది.. నేను ఎక్కువ కోపపడుతున్నానా అందరిపైనా అంటూ సంజన అడిగింది. దీనికి అసలు లేదు.. నీకేమైనా అయిందా ఇంత ప్రశాంతంగా అయిపోయావ్ అని మేము షాకవుతున్నాం అంటూ భర్త సెటైర్ వేశాడు.

