బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 68 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఫ్యామిలీ వీక్‌ను వచ్చే వారానికి వాయిదా వేశారు. అయితే హౌస్‌మేట్స్ అందరికీ తమ జ్ఞాపకాలు గుర్తు చేస్తూ చిన్ననాటి స్వీట్ మెమొరీస్‌ని హౌస్ లోపలికి పంపించాడు. ప్రతి ఒక్కరికీ సంబంధించిన తమ చిన్ననాటి ఫొటోని హౌస్‌లో చూసి అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు.
గార్డెన్ ఏరియాలో తనూజ అటు ఇటూ నడుస్తూ ఎమోషనల్ అయింది. ఇది చూసి ఏయ్ నేను ఏమన్నానురా బాబు.. నేను ఏం అనలేదు నాకేం సంబంధం లేదు.. అని కళ్యాణ్ సరదాగా అన్నాడు. కళ్యాణ్ చిన్నప్పుడు కృష్ణుడు వేషం వేసిన ఫొటోని పంపించాడు. ఇది చూసి తన జ్ఞాపకాలు కళ్యాణ్ పంచుకున్నాడు.
ఇమ్మానుయేల్‌కి తన బ్రదర్‌తో చిన్నప్పుడు తీసుకున్న ఫొటో వచ్చింది. ఈ ఫొటోలో ఇది నేను ఇమ్మానుయేల్.. ఇది మా అన్న డేనియల్.. మా ఇద్దరిదీ ఏడాదికి ఒక ఫొటో ఉంటుంది.. కష్టాలు అందరికీ ఉంటాయి.. మా అమ్మకి నన్ను కనడం ఇష్టం లేదు.. ఎందుకంటే అప్పటికే మా అమ్మకి తినడానికి తిండి ఉండేది కాదు.. మాకు పాక ఇల్లు ఉండేది.. నా 10th అయిపోయేవరకూ కూడా మేము అక్కడే ఉన్నాం అని చెప్పాడు.
Also Read:తిమ్మక్క మరణం బాధ కలిగించింది!
తనూజకి తన సిస్టర్‌తో చిన్నప్పుడు తీసుకున్న ఫొటో వచ్చింది. ఈ ఫొటో నేను యూకేజీలో ఉన్నప్పుడు తీసుకుంది. మేము ముగ్గురం అక్కచెల్లెళ్లం.. ముగ్గురూ వరుసగా కూతుర్లే పుట్టడంతో అందరూ నాన్నని జాలిగా చూసేవాళ్లు ..అన్నింటికీ థాంక్యూ.. ఐ లవ్యూ.. అంటూ తనూజ చెప్పింది.

