బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం నామినేషన్స్‌ని ఎక్స్ కంటెస్టెంట్ల చేత చేయిస్తుండగా హౌస్‌లోకి దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ ఐయామ్ బ్యాక్.. అలా వెళ్తాను అనుకోలేదు ఇలా వస్తాను అనుకోలేదు అంటూ హౌస్‌లో అడుగుపెట్టింది శ్రీజ.
ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు.. అంటూ గెలికింది దమ్ము. ఐయామ్ గుడ్.. అని మాధురి అంటే మీ పేరు మాధురి గారా.. మాస్ మాధురా.. రాజు గారా తెలియట్లేదన్నమాట.. అంటే ఏమని పిలవాలా అని.. మళ్లీ పేరు తెలీదని అనుకుంటారు కదా.. అంటూ పాత గొడవని మళ్లీ రాజేసింది. నాకు కూడా నువ్వు ఎవరో ఇంతవరకూ తెలీదు.. అని మాధురి కౌంటర్ వేస్తే అదే కదా తెలియాలని రూల్ లేదు కదా అంటూ శ్రీజ డైలాగ్ కొట్టింది.
ఈ మాటలకి మాధురికి కాలింది. దీంతో ఇప్పుడు నాతో గొడవపడటానికి వచ్చావా.. అని ఎప్పటిలానే తన ఊతపదం వాడేసింది. మాధురితో అయిపోగానే తనూజ వైపు తిరిగింది శ్రీజ. తనూజని కూడా ఏకిపారేసింది శ్రీజ. తర్వాత బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి.. శ్రీజ మీరు ఇక్కడికి వచ్చింది నామినేట్ చేయడానికి.. ఆ పని చేస్తే సరిపోతుంది.. అంటూ అడ్డుపడ్డాడు.
నేను చాలా చాలా డిజప్పాయింట్ అయిన పర్సన్ ఈ హౌస్‌లో కళ్యాణ్ అంటూ వెళ్లి కత్తి బలంగా దింపింది. నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. అని కళ్యాణ్‌ని ముఖం మీదే అడిగింది శ్రీజ. శ్రీజ పాయింట్లని డిఫెండ్ చేసుకోవడానికి కళ్యాణ్ ట్రై చేశాడు. నేను రమ్యతో మాట్లాడలేదని నువ్వు అంటున్నావ్.. రమ్యతో నేను గంట మాట్లాడానన్న విషయం వీళ్లందరికీ తెలుసు అన్నారు. నువ్వు ఇక్కడున్న జనాల గురించి ఆలోచిస్తున్నావ్ తప్ప బయట ఎంతమంది చూశారు.. నిన్ను అమ్మాయిల పిచ్చోడు అంటే స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదని అనుకుంటారు అన్న విషయం నువ్వు ఆలోచించట్లేదు అని కళ్యాణ్‌ను వాయించేసింది.
Also Read:మీసాల పిల్ల…ట్రెండింగ్ @ 1

