BB9:మాధురి పక్కా లోకల్

5
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 45 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా మాధురి పక్కా లోకల్‌గా మారి రచ్చరచ్చ చేసింది. నిన్నటి ఎపిసోడ్‌లో సందన టీమ్ క్యాష్‌ని స్టోర్ రూమ్ నుంచి కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సంజన టీమ్ హర్ట్ కాగా వీరికి మాధురి కూడా సపోర్ట్ చేసింది. మాధురి సపోర్ట్ తో సంజన కాస్త ఫైర్ అయింది. దివ్య నువ్వు మా క్యాష్ తీశావా అని అడిగింది. నేను తీయలేదు నాకు గుర్తులేదు.. అంటూ దివ్య చెప్పడంతో సంజన సీరియస్ అయింది. ఓకే రేపటి నుంచి నువ్వు లేకుండా గేమ్ ఆడతాం.. ఇదే పనిష్మెంట్ అంటూ సంజన అంది. దీంతో దివ్య ఫైర్ అయింది. మీరు ఎగ్స్ కొట్టేసినప్పుడు లేదా.. అయి ఫెయిర్ అయినప్పుడు ఇది కూడా ఫెయిర్‌యే మీకు ఒక రూల్ మాకు ఒక రూల్ ఉండదు కదా అంటూ కౌంటర్ ఇచ్చింది.

తనూజ-సుమన్ శెట్టి కలిసి కొట్టేసిన క్యాష్ గురించి టీమ్ అంతా పట్టుబట్టడంతో మాధురి చివరికి ఒక డీల్ చేసింది. తనూజ వాళ్లు సంజన టీమ్‌కి చెందిన 6 వేల బీబీ క్యాష్ కొట్టేశారు. అందులో 3 వేలు తనూజ-దివ్య-సుమన్ ఉంచేసుకొని 3 వేలు మాత్రమే మాధురికి ఇచ్చారు. తర్వాత మాధురి టీం .. ఒకవేళ అన్‌ఫెయిర్ అయ్యుంటే వాళ్ల డబ్బులు అప్పుడే ఇచ్చేసి మీ డబ్బులు ఉంచుకోండి ఆడుకోండి అని చెప్పుండేవాళ్లు.. చెప్పలేదు కనుక దొంగతనం ఫెయిర్ గేమ్ అని డిసైడ్ చేశారు.. సో దొంగతనం చేసుకోవచ్చు అని మాధురి తన రీజన్స్ చెప్పింది.

ఇంతలో సంజన అక్కడికి వచ్చి ఐదుగురు అలిగి ఆటలాడితే ఎలా.. అంటూ అడిగింది. అలగమని ఎవరూ చెప్పలేదు సంజన.. అని మాధురి వాదించింది. లేదండీ బాధగా ఉంటుంది కదా.. అని సంజన చెప్పింది. 7వ వారంలో ఉన్న నీకే ఇలా ఉంటే ఫస్ట్ వీక్‌లోనే నామినేషన్‌లో ఉన్న వాళ్లకి ఎలా ఉంటుంది మేము ప్రాణం పెట్టి ఆడాలని వాళ్లకి ఉంటుంది అంటూ మాధురి చెప్పింది.

వాష్ రూమ్ దగ్గరికి వచ్చి ఇమ్మూతో సంజన ఇదే డిస్కస్ చేసింది. వీళ్ల డిస్కషన్‌ని మాధ/రికి చెప్పగా మాధురి ఫైర్ అయింది. ఈ ఎక్స్‌ట్రాలు తగ్గించుకోమని చెప్పు ఇలాంటి మాటలు మాట్లాడితే కాలుతుంది.. ఏ క్లాస్ ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు ఆవిడ.. అంటూ మాధురితో పాటు కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యాడు. కాసేపటి తర్వాత ఇద్దరు గ్యాంగ్ లీడర్లకి రెండు షాపులు ఇచ్చాడు బిగ్‌బాస్. మాధురి ఏమో టీ స్టాల్ తీసుకుంటే సంజన పానీపూరి షాప్ తీసుకుంది. ఈ షాపుల ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు.. అలానే మెంబర్లని గ్యాంగ్ మార్చుకునేందుకు మంతనాలు చేసుకోవచ్చని బిగ్‌బాస్ చెప్పాడు.

Also Read:‘కాంత’ ..క్లాస్ రొమాంటిక్ మెలోడీ

- Advertisement -