BB9:కెప్టెన్ కంటెండర్లు వీరే!

4
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 39 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌ భాగంగా ఆసక్తికరంగా సాగింది. రమ్య ఫుడ్ పవర్ యూజ్ చేసి ఆర్డర్ చేసిన ఆహారం బిగ్‌బాస్ పంపించాడు. ఇది చూసి మిగిలిన హౌస్‌మేట్స్ అందరికీ నోరు ఊరిపోయింది. కానీ రమ్య.. తాను సెలక్ట్ చేసుకున్న సుమన్ శెట్టితో మాత్రమే ఈ ఫుడ్ షేర్ చేసుకోవాలి. అయితే తినిపిస్తా అంటూ సంజన.. రమ్య పక్కన కూర్చుంది.

దివ్య దగ్గరికెళ్లి భరణి మాట్లాడాడు. రీతూ నిన్ను, నన్ను నామినేట్ చేసిన తర్వాత కూడా నువ్వు తనతో అంత క్లోజ్‌గా ఉండటం కూడా నాకు నచ్చలేదు.. అని భరణి అన్నాడు. తర్వాత మాటలకి దివ్య ఎమోషనల్ అయిది. ఇవే వద్దనేది..నాకు ఈ హౌస్‌లో ఫస్ట్ మీరే.. మీరు అందరితో మాట్లాడుతున్నారు.. నేను కూడా మాట్లాడాలి కదా.. ప్రతిదానికి మీరూ ఇలా అంటే ఎలా.. నిన్న ఏదో సరదాగా మాట్లాడా ఫస్ట్ టైమ్ నేను అలా మాట్లాడటం అంటూ దివ్య ఓదార్చింది.

తర్వాత బిగ్‌బాస్ ఒక అనౌన్స్‌మెంట్ చేశాడు. ఫైర్ స్ట్రామ్స్ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నేను వాళ్ల ఉత్సాహం, ఆట తీరుని నిశితనంగా పరిశీలిస్తున్నాను.. అందుకే నేను వారిని కెప్టెన్సీ కంటెండర్స్‌గా ప్రకటిస్తున్నాను..ఇప్పుడు ఫైర్ స్ట్రామ్స్ మిగతావారి నుంచి ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్స్‌ని ఎంచుకోవాల్సి ఉంటుంది.. వారు ఎవరో చర్చించి నిర్ణయించి చెప్పండి.. నిఖిల్ దగ్గర కంటెండర్ పవర్ ఉన్నందుకు ఈ ప్రక్రియలో ఆయన పాల్గొనరు అని బిగ్‌బాస్ చెప్పాడు. అందరూ చర్చించుకుని సంజన, భరణి, దివ్య, సుమన్ శెట్టి, తనూజలని కంటెండర్లుగా సెలక్ట్ చేశారు.

ప్రతి రౌండ్‌లో బజర్ మోగగానే రెండు టీముల సభ్యులు చేయాల్సింది ఏంటంటే రెడ్ లైన్ మీద ఉన్న బాల్‌ని తీసుకొని తమ శక్తిని లేదా ఇతర స్ట్రాటజీని ఉపయోగించి ప్రత్యర్థి గోల్ పోస్టులో గోల్ చేయాలి.. ఒకవేళ మీ టీమ్ ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లో గోల్ చేయగలిగితే వారి టీమ్ నుంచి ఏ ఒక్కరిని రేసు నుంచి తప్పించాలనేది గోల్ చేసిన సభ్యులు నిర్ణయిస్తారు.. ఇలా టాస్క్ ముగిసే సమయానికి ఎవరు ఆటలో నిలుస్తారో ఆ సభ్యులు తమ కెప్టెన్సీ కంటెండర్‌షిప్‌ని కాపాడుకొని రేసులో నిలుస్తారు అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్కులో వైల్డ్‌కార్డ్స్ చాలా బాగా ఆడారు. ముఖ్యంగా సాయి, గౌరవ్ బాగాఆడారు. చివరి రౌండ్ ముగిసేసరికి అవతలి టీమ్‌లో సుమన్ శెట్టి ఒక్కడే మిగిలాడు. దీంతో వైల్డ్ కార్డ్స్‌లో గేమ్ ఆడిన ఐదుగురు ప్లస్ సుమన్ శెట్టిలు కెప్టెన్సీ కంటెండర్లు అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు.

Also Read:SYG అవుట్ స్టాండింగ్ సినిమా!

- Advertisement -