బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 3 రోజులు పూర్తి చేసుకుంది. తొలుత ఓనర్లు అయిన కామనర్ల దగ్గరికొచ్చి ఒక కప్పు ఛాయ్ ఇవ్వరా ప్లీజ్ అంటూ సంజన అడిగింది. దీనికి లేదు అని మనీష్ చెప్పాడు. తనకు రోజు టీ తాగే అలవాటు ఉందని చెప్పిన మనీష్ వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత కామనర్ల మధ్య చర్చ జరిగింది. ఈ వారం ఎలిమినేట్ ఎవరుతారు.. అని దమ్ము శ్రీజ అడిగితే సంజన కావాలి అని మనీష్ అన్నాడు. ఆ తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్‌లో ఒక గుడ్డు పోయింది అంటూ కామనర్లు చూసుకున్నారు. తొలుత సంజన మీదే అందరికీ డౌట్ వచ్చింది. దీంతో వెళ్లి అడిగితే నో అంటూ నవ్వుతూ చెప్పింది సంజన.
ఇక గుడ్డు ఎవరు తీశారో తెలీక కాసేపు జుట్టు పీక్కున్న కామనర్లు చివరికి ఓ డెసిషన్ తీసుకుంటారు. టెనెంట్స్ లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని.. ఇక సెలబ్రెటీలు ఎవరికీ తమ ఇంట్లోకి వచ్చేందుకు పర్మిషన్ లేదంటూ కామనర్లు అనౌన్స్ చేశారు. దీంతో టెనెంట్లు అంతా కలిసి ప్లీజ్ గుడ్డు ఎవరు తీశారో చెప్పండి.. ఒకరి వల్ల అందరికీ ప్రాబ్లమ్ అవుతుంది అంటూ మాట్లాడుకున్నారు.
ఈ క్రమంలో భరణి – హరీష్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏది మాట్లాడు అయితే ఊరుకుంటే తెగ రెచ్చిపోతున్నావ్.. ఆగవయ్యా మాట్లాడు.. అంటూ మీదకి వెళ్లాడు భరణి. దీంతో హరీష్ కూడా తగ్గేదేలే అంటూ భరణి ముఖంలో ముఖం పెట్టి మీరు ఆగమంటే నేను ఆగను.. నేను ఆగను.. ఏంటి ఇప్పుడు అంటూ రెచ్చిపోయాడు. ఇలా హౌస్ మొత్తం రచ్చరచ్చ అయ్యాక అసలు విషయం చెప్పింది సంజన. నాకు ఆకలేసి నేనే గుడ్డు తిన్నాను.. ఎగ్ అడిగితే ఎవరూ ఇవ్వరని ఫీలై అలా చేశాను.. నాకు భోజన సరిపోక తిన్నాను అని చెప్పింది . దీంతో ఓనర్లంతా వచ్చి సంజన మీద ఫైర్ అయ్యారు.
ఈ విషయం తెలియగానే శ్రష్టికి కూడా బీపీ తన్నేసింది. సంజన మీదకెళ్లి సిగ్గులేదా గుడ్డు తినడానికి అంటూ శ్రష్టి తిట్టింది. నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు.. అంటూ సంజన ఫైర్ అయింది. నా గురించి మీకు తెలీదు.. నేను విక్టీమ్ (బాధితురాలిని).. నేను ప్రతి రోజూ రాత్రి ఏడుస్తాను.. అంటూ సంజన కన్నీరు పెట్టుకుంది. మొత్తంగా గుడ్డు తెచ్చిన తంటాతో హౌస్ రచ్చరచ్చగా మారింది.
Also Read:కాంగ్రెస్ అహంకారానికి ఓటుతో బుద్ధిచెప్పాలి

