BB9: కెప్టెన్‌గా డీమాన్

8
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా 11 రోజులు పూర్తి చేసుకుంది. ఇక కెప్టెన్‌ కోసం నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో డీమాన్ విజయం సాధించి హౌస్‌కి కొత్త కెప్టెన్ అయ్యాడు.

తొలుత కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓనర్లు-టెనెంట్ల మధ్య జరిగిన టాస్క్‌ల్లో ఓనర్లు గెలవడంతో బిగ్‌బాస్ వారి నుంచే కెప్టెన్సీ కంటెండర్లని సెలక్ట్ చేయాలని డిసైడ్ చేశాడు. కానీ ఇందులో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. మొత్తం ఓనర్లుగా ఉన్న ఏడుగురిలో ఏ నలుగురైతే కెప్టెన్సీకి అనర్హులని భావిస్తారో వాళ్ల పేర్లు చెప్పి రేసు నుంచి తప్పించాలని టెనెంట్లకి పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఎక్కువమంది డీమాన్ పవన్‌ కెప్టెన్‌గా వద్దని ఓట్లు వేశారు. సరిగ్గా అప్పుడే రీతూ చౌదరి మర్యాద కంటే ప్రియ, దమ్ము శ్రీజ కంటే కెప్టెన్‌గా డీమాన్ బెటర్ అంటూ వాదించింది. దీంతో తీసేసే పేర్లలో డీమాన్ పేరు చేర్చలేదు.

తర్వాత కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచిన భరణి, మర్యాద మనీష్, డీమాన్ పవన్‌కి బిగ్‌బాస్ ఓ అనౌన్స్‌మెంట్ చేశాడు. మీరు ముగ్గురూ కలిసి టెనెంట్స్ టీమ్ నుంచి మీరనుకుంటున్న బెస్ట్ ప్లేయర్‌ ఒకరికి కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ పడే ఛాన్స్ ఇవ్వొచ్చు.. ఆ నిర్ణయాన్ని వెంటనే చెప్పండని బిగ్‌బాస్ అడిగాడు. కెప్టెన్సీ కోసం మర్యాద, డీమాన్, భరణి, ఇమ్మానుయేల్‌కు ‘రంగు పడుద్ది’ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్.

Also Read:కిష్కింధపురి..ఇండస్ట్రీ సక్సెస్!

తొలి రౌండ్ మొదలుకాగానే తెలివిగా మర్యాద పక్క వాళ్ల రంగు పళ్లెం ఉన్న స్టాండ్‌ని ఢమాల్ అని తన్నేశాడు. దీంతో అవతలి వాళ్లు కూడా ఇదే చేశారు. అయితే ఎక్కువ రంగు అంటుకోవడంతో ఈ రౌండ్‌లో మనీష్ ఔట్ అయ్యాడు. తర్వాతి రౌండ్ మొదలైంది. అయితే ఈసారి భరణి-ఇమ్మూ కలిసి డీమాన్‌ని టార్గెట్ చేశారు. అయితే ఇద్దరినీ బానే హ్యాండిల్ చేస్తూ కాసేపు ఫైట్ చేశాడు పవన్. కానీ ఇది చూసి కామనర్లు నోటికి పని చెప్పారు. ఈ రౌండ్‌లో భరణి ఔట్ అయ్యాడు.

చివరిగా ఇమ్మానుయేల్-డీమాన్ గేమ్‌లో మిగిలారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ గేమ్‌లో డీమాన్ విజేతగా నిలిచి కొత్త కెప్టెన్ అయ్యాడు.

- Advertisement -