BB9:చుక్కలు చూపించిన బిగ్‌బాస్

8
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా డే1( Bigg Boss 9 ) పూర్తి చేసుకుంది. తొలుత గేమ్ ఛేంజర్‌లోని “రా మచ్చా మచ్చా సాంగ్”కి హౌస్‍‌ లోపలికి డ్యాన్సర్లని రప్పించి మరీ చిందులు వేయించారు. తర్వాత మెయిన్ హౌస్‌కి ఓనర్లయిన కామనర్లు.. ఔట్ హౌస్ టెనెంట్లు అయిన సెలబ్రెటీలకి ఒక ఆఫర్ ఇచ్చారు. మీరు మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయండి.. అప్పుడు మీరు మా హౌస్‌లోకి రావచ్చు.. నచ్చిన ఫుడ్ తినొచ్చని ఆఫర్ ఇచ్చారు. కామనర్లు అగ్నిపరీక్షని ఎదుర్కొని ఈ హౌస్‌లో ఓనర్స్‌గా అర్హత సాధించారు.

తర్వాత ఓనర్స్ , టెనెంట్లకి ఇంట్లో పనులు అప్పగించారు. హౌస్ క్లీనింగ్ శ్రష్టి, ఇమ్మానుయేల్‌కి అప్పగిస్తూ హరీష్ డెసిషన్ తీసుకున్నాడు. బట్టలు ఉతకడం, ఆరేయడం అన్నీ రాము రాథోడ్‌కి ఇచ్చింది దమ్ము శ్రీజ. తనూజ, భరణిలకి కుకింగ్ అప్పగిస్తూ ప్రియ చేసిన కామెంట్ వాదనకి దారి తీసింది. వీళ్లు కుకింగ్ మాత్రమే వాళ్లు చేస్తారు.. కిచెన్‌లో క్లీనింగ్ కూడా వీళ్లు చేయరు.. చేయనివ్వను అంటూ ప్రియ చెప్పింది.

తర్వాత ఫుడ్ తింటున్న సెలబ్రెటీలకి బిగ్‌బాస్ షాకిచ్చాడు. టెనెంట్స్.. ఇల్లు ఓనర్స్‌కి మాత్రమే.. మీరు బయటకి వెళ్లండి.. అంటూ బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు. అన్నం కూడా తినొద్దా.. అంటూ సెలబ్రెటీలు అవాక్కయ్యారు. అంత పని చేసి కూడా ఇమ్మానుయేల్ ఫుడ్ తినలేకపోయడు.

Also Read:ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?

కాసేపటికి ఆకలి వేయడంతో సైలెంట్‌గా హౌస్‌లోకి వెళ్లి బిస్కెట్ ప్యాకెట్లు కొట్టుకొచ్చేసింది రీతూ చౌదరి. సెలబ్రెటీల్లో అందరూ ఫేక్‌గానే ఉన్నారంటూ ప్రియ గుసగుసలాడింది. కాసేపటికి అందరికీ చిన్న సర్‌ప్రైజ్ ఇస్తూ గార్డెన్ ఏరియాలో ఫుడ్ ఎర్పాటు చేశాడు బిగ్‌బాస్. అయితే ఎవరికోసం పంపిన ఫుడ్ వాళ్లే తినాలి.. అంటూ కండీషన్ పెట్టాడు. దీంతో కామనర్లు అంతా ఒకవైపు.. సెలబ్రెటీలు అంతా మరోవైపు కూర్చున్నారు.

- Advertisement -