బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 89 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే నిఖిల్, రోహిణి, అవినాష్‌లు టికెట్ టు ఫినాలే కంటెండర్స్ కాగా గౌతమ్, పృథ్వీ, టేస్టీ తేజాలకు మరో అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఈ ముగ్గురిలో ఒకరికి నాలుగో కంటెండర్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. ఇందుకోసం రోహిణి, నిఖిల్, అవినాష్‌లకు స్పెషల్ పవర్ ఇచ్చి.. పృథ్వీ, తేజా, గౌతమ్‌లలో ఒకర్ని ఎంపిక చేసి అందుకు గల కారణాలను చెప్పాలన్నారు.
తొలుత రోహిణి.. తేజా పేరు చెప్పింది. నాకంటే మీరిద్దరూ స్ట్రాంగ్ కాబట్టి నా స్వార్థం కోసం తేజా అయితే బెటర్ అనిపిస్తుంది అని చెప్పింది.తర్వాత నిఖిల్‌ని నువ్వు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావ్ అని అవినాష్, రోహిణి అడగ్గా తేజాకి ఇచ్చేద్దాంలే అని నిఖిల్ చెప్పాడు. మొత్తంగా టికెట్ టు ఫినాలే రేస్‌లోకి అనూహ్యంగా టేస్టీ తేజా వచ్చాడు.
ఇక టేస్టీ తేజాకి ఛాన్స్ ఇవ్వడాన్ని తప్పు పట్టాడు పృథ్వీ. బాధపడ్డాడని ఛాన్స్ ఇస్తే.. నేను కూడా ఆట ఆడకుండా బాధపడుతూ కూర్చుంటా అని కౌంటర్ ఇచ్చాడు.
Also Read:ఈ కషాయం తాగితే.. ఆ రోగాలు మాయం!