Bigg Boss 8 Telugu: ఫ్యామిలీ వీక్..రోహిణి తల్లి కామెడీ సూపర్బ్

2
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 72 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వారం కంటెస్టెంట్స్ కోసం వారి ఫ్యామిలీ సభ్యులు హౌస్‌లోకి రాబోతున్నారు. తొలుత కంటెస్టెంట్లకి ఓ ఫన్నీ టాస్కు ఇచ్చాడు. మీరు నవ్వుకోవడంతో పాటు ఆడియన్స్‌ను కూడా ఈ వారం నవ్విస్తారని ఆశిస్తున్నా అంటూ ఓ ఫన్నీ టాస్కు చేయమన్నాడు. ఓ టాస్కు చేస్తుంటే మధ్యలో ఓ బుడ్డోడు నెమ్మదిగా లోపలికి ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఎవడ్రా వీడు అనుకునే లోపు రోహిణి పరిగెత్తికెళ్లి వాడిని ఎత్తుకుంది. నా మేనల్లుడు అంటూ అందరికి పరిచయం చేసింది.

ఆ వెంటనే మెయిన్ డోర్ నుంచి రోహిణి తల్లి ఎంట్రీ ఇచ్చారు. ఆమెను చూడగానే రోహిణి పరిగెత్తుకెళ్లి హత్తుకొని ఎమోషనల్ అయింది. ఇదేంటే నా మీద బెంగ పెట్టుకోలేదా.. బుగ్గలు వచ్చేశాయ్ అంటూ రోహిణి ఏడిపించింది. అందరినీ పలకరించారు రోహిణి అమ్మ. అందరూ బాగా ఆడుతున్నారు .. అందరూ నాకు ఇష్టమే.. అంటూ చెప్పారు.

ఇలా అందరితో మాట్లాడుతూ ఇంట్లో అన్ని పనులు చేస్తున్నావ్.. ఇది చాలు.. రేపు అత్తారింటికి వెళ్లాక అన్నీ చేయాలి కదా.. ఆడపిల్లకి తప్పదు కదా.. అంటూ రోహిణితో అన్నారు. ఇంతలో తేజ మరి సంబంధాలేమైనా చూస్తున్నారా.. హెల్తీ బాయ్‌ను (గౌతమ్) చూస్తున్నారా.. ఓకే అంటే చెప్పండి మరి.. అంటూ కామెడీ చేశాడు. ఒకసారి మావయ్య అనమ్మా.. అంటూ తేజ అంటే మావయ్య అంటూ ముద్దుగా పిలిచాడు రోహిణి మేనల్లుడు.

ఆ తర్వాత రోహిణితో కాసేపు ఒంటరిగా మాట్లాడారు అమ్మ. నువ్వు అందరితో మంచిగా బాగానే ఉంటున్నావ్.. కానీ కొంతమంది నీ ముందు బాగానే ఉంటారు కానీ వెనకాల వేరేలా ఉన్నారు.. అది చూసుకో అని సలహా ఇచ్చింది. వెళ్లే ముందు మీ అమ్మాయి కోసం మీరు ఒక గేమ్ ఆడాలి.. టేబుల్‌కి ఒకవైపు నిలబడి బౌన్స్‌తో అన్ని బాల్స్‌ను గ్లాసుల్లో వేయాలి.. చివరిగా ఏ బాల్ అయితే గ్లాసులో పడుతుందో..దాని వెనుక రాసి ఉన్నది మీ తరఫున అమ్మాయికి ఇచ్చే గిఫ్ట్.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. అలా కూతురికి ఓ గిఫ్ట్ ఇచ్చేసి వెళ్లిపోయింది రోహిణి మదర్.

Also Read:కంటివెలుగు కతమయింది..తెలంగాణ భవిష్యత్ చీకటయింది

- Advertisement -