Bigg Boss 8 Telugu: నబీల్ మ్యాచ్ మిక్సింగ్

1
- Advertisement -

బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 61 రోజులు పూర్తి చేసుకుంది. మెగా చీఫ్ ఎంపిక కోసం పెట్టిన టాస్కులో నిన్నటి ఎపిసోడ్‌లోనే హరితేజ, తేజ ఔట్ కాగా మిగిలిన నలుగురి మధ్య ఇవాళ గేమ్ కంటిన్యూ అయింది. నబీల్, నిఖిల్, ప్రేరణ ఒకే క్లాన్‌లో ఉండగా అవినాష్ ఒక్కడే రాయల్స్ క్లాన్ మెంబర్..దీంతో ముగ్గురూ కలిసి ఫస్ట్ అవినాష్‌ను తీసేద్దామని ఓ మాట అనుకున్నారు. కానీ తీరా బజర్ మోగిన తర్వాత నిఖిల్ తన వ్యూహం మార్చి నబీల్‌పై అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో నబీల్‌కు డిఫెండ్ చేసుకోవడమే సరిపోయింది.

అవినాష్‌ను ప్రేరణ టార్గెట్ చేయగా ఎన్ని మాటలు మాట్లాడినా అవినాష్ ఏమాత్రం తగ్గకుండా తన గేమ్ తాను ఆడుతూ ప్రేరణపై అటాక్ చేశాడు. దీంతో మధ్యలో ప్రేరణ.. నిఖిల్ , నబీల్ సపోర్ట్ కూడా అడిగింది.

మధ్యలో గ్యాప్ దొరకగా గ్యాప్‌లో నబీల్‌తో మాట్లాడాడు అవినాష్. నిఖిల్‌ని తీసేద్దామా మనమిద్దరం కలిసి అంటూ అవినాష్ సలహా ఇవ్వగానే ఇద్దరూ తీసేద్దాం.. కావాలంటే నేనే ఓడిపోతే నువ్వు చీఫ్ అవ్వు పర్లేదు.. అంటూ నబీల్ అన్నాడు… ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంది.. ఆడ మగ అని ఏం లేదంటూ అవినాష్ అన్నాడు. తర్వాత రౌండ్‌లో ప్రేరణను సంచాలక్ చేశాడు బిగ్‌బాస్. ఇక బజర్ మోగిన వెంటనే నిఖిల్‌ని టార్గెట్ చేశారు అవినాష్, నబీల్. కానీ నిఖిల్ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇద్దరినీ చాలా సేపు మేనేజ్ చేశాడు. ఈ రౌండ్‌లో సక్సెస్‌ఫుల్‌గా నిఖిల్‌ని తప్పించేశారు నబీల్-అవినాష్.

తర్వా బిగ్ బాస్ చివరి రౌండ్‌కి నిఖిల్‌ని సంచాలక్ చేశాడు . బజర్ మోగగానే నబీల్ ఏదో చెయ్యాలంటే చేయాలి అన్నట్లు ఒక్కసారి మాత్రమే అవినాష్ బ్యాగ్‌పై చేయి వేశాడు. ఇక అవినాష్ నబీల్ బ్యాగ్‌ను ఖాళీ చేస్తున్నా పట్టించుకోలేదు. నబీల్ నువ్వు ఆడు.. ఎందుకు ఇచ్చేస్తున్నావ్ అంటూ కంటెస్టెంట్లు అరుస్తున్నా కూడా ఆడుతున్నా అంటూ కవర్ చేశాడు నబీల్. ఈ రౌండ్‌లో అవినాష్ విన్నర్ అని ప్రకటించాడు నిఖిల్. దీంతో అవినాష్ మెగా చీఫ్ అయిపోయాడు.

Also Read:ఓదెల 2-తిరుపతిగా వశిష్ట

- Advertisement -