Bigg Boss 8 Telugu:మణికంఠ ఎలిమనేట్

1
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా ఏడు వారాలు పూర్తిచేసుకుంది. ఏడో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు మణికంఠ. ఇక్కడ ఉండలేకపోతోన్నాను.. బయటకు వెళ్తాను.. నన్ను పంపించేయండి.. నాకు ఓట్లు వేయకండి అని చెప్పి మరి బయటకు వచ్చాడు మణికంఠ. మొదటి సీజన్‌లో సంపూర్ణేష్ బాబు, నాలుగో సీజన్లో నోయల్ హెల్త్ సమస్యలతో బయటకు రాగా ఈ సారి మణికంఠ మాత్రం ఆరోగ్యం బాగానే ఉన్నా తనంతా తానే బయటకు వచ్చారు.

ఇక ఆడియెన్స్ మణికంఠను సేవ్ చేసినా కూడా కూడా వృథా అయిపోయింది. వాస్తవానికి తొలుత గౌతమ్ ఎలిమినేట్ కాగా మణికంఠ తన సొంత నిర్ణయంతో ఆటను మధ్యలోనే వదిలి బయటకు వచ్చేశాడు. తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన మణికి బోట్ ఎక్కిస్తావ్.. ఎవరిని ముంచేస్తావ్ అనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున.

నబిల్ చాలా మంచి వాడు.. మెహబూబ్ కామ్ అండ్ కంపోజ్..హరితేజకు ఈ ఇంట్లో ఉండాల్సిన అర్హతల్నీ ఉన్నాయ్.. ఆమె లోపల ఎంటర్టైనర్ ఉన్నారు అన్నారు. అవినాష్, రోహిణిలు నవ్విస్తారు.. వీళ్లంతా బోట్ ఎక్కిస్తా అని అన్నాడు. తేజ, నిఖిల్ వీళ్లంతా డౌన్ అయ్యారని నీటిలో ముంచేశాడు. పృథ్వీ బాగా ఆడతాడు.. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడు.. అవసరం అయినప్పుడే నోరు విప్పు అని గౌతమ్‌కి సలహాలు ఇచ్చి ముంచేశాడు. అనవసరమైన చోట నోరు విప్పొద్దు.. పక్కోడి బ్రెయిన్‌ను కంట్రోల్ చేయాలని చూడకు అంటూ ప్రేరణను కూడా నీటిలోనే ముంచేశాడు. తనకు ఓట్ వేసిన వారందరికీ థాంక్స్ చెబుతూ.. బయటకు వెళ్లి అందరినీ ఎలా ఎంటర్టైన్ చేయాలో అలా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.

Also Read:Bigg Boss 8 Telugu: మెగా చీఫ్‌గా గౌతమ్

- Advertisement -