Bigg Boss 8 Telugu:వాడివేడిగా నామినేషన్‌.. నైనిక వర్సెస్ నబీల్

7
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా నాలుగో వారంలోకి ఎంట్రీ ఇవ్వగా నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. ఒక్కొక్క సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉండగా నామినేట్ చేసే సబ్యుడి ముఖం మీద ఫోమ్ (నురగ) కొట్టాలని చెప్పారు బిగ్ బాస్. నిఖిల్ చీఫ్ అయిన కారణంగా ఎవరూ నామినేట్ చేయడానికి వీలు లేదని చెప్పాడు బిగ్ బాస్.

నామినేషన్ ప్రక్రియ ఆదిత్యతో మొదలుకాగా పృథ్వీ,సోనియాలను నామినేట్ చేశారు. పద్మావతి 2.0 టాస్కులో కావాల్సిన దానికన్నా అగ్రెషన్ చూపించాడని.. అలానే తనని అవమానించేలా మాట్లాడాడంటూ ఆదిత్య రీజన్ చెప్పాడు. ఇక సోనియాను నామినేట్ చేస్తూ హౌస్‌లోకి వచ్చిన ఫస్ట్ 3 డేస్‌లో కనిపించిన సోనియా తర్వాత కనిపించలేదు అని చెప్పగా సోనియా కాస్త వెటకారంగా సమాధానమిచ్చింది.

తర్వాత నైనిక..మణికంఠ,ఆదిత్యలను నామినేట్ చేసింది. నువ్వు సెల్ఫిష్, అలానే ఎదుటివాళ్లను డీమోటివేట్ చేస్తావ్… నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే వేరే వాళ్ల కాన్ఫిడెన్స్ డౌన్ చేయకు అని మణికంఠకు సూచించింది. ఇక నబీల్ వంతు రాగా సోనియాతో పెద్ద గొడవే జరిగింది. నేను సంచాలక్‌గా కన్ఫ్యూజ్ అయినవ్ అన్నావ్.. కానీ బెలూన్ టాస్కులో నువ్వు సంచాలక్ అయినప్పుడు.. అభయ్ తప్పు చేసినప్పుడు.. అక్కడే డిస్క్ క్వాలిఫై చేసి నిఖిల్‌ను విన్నర్ అని చెప్పేయాల్సింది అని చెప్పాడు. సోనియా ఏదో చెబుతుంటే “నా పాయింట్ అయిపోని.. ఓఓ.. మేడమ్.. నువ్వు హైదరాబాద్ అంతా తిప్పి తీసుకురాకు అని నబీల్ చెప్పగా అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు సోనియా. తన రెండో నామినేషన్ పృథ్వీకి వేశాడు నబీల్. కోపంలో ఎఫ్ వర్డ్స్ యూజ్ చేయడం చాలా రాంగ్.. సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం.. నేను బయాస్డ్ కాదు అని చెప్పాడు.

Also Read:Bigg Boss 8 Telugu: అభయ్ ఎలిమినేట్

ఇక నైనిక తొలుత మణికంఠను నామినేట్ చేసింది. ఇందుకు కారణం నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కావడం లేదని చెప్పింది. తన రెండో నామినేషన్ నైనికకి వేసింది ప్రేరణ. నువ్వు కొంచెం సైలెంట్ అయిపోయావ్.. నువ్వు కొన్ని టాపిక్స్‌లో ఇమ్మెచ్యూర్‌గా ఉన్నావ్ అని చెప్పింది నైనిక.

- Advertisement -