Bigg Boss 8 Telugu:ఈ వారం నామినేషన్‌లో ఉంది వీరే

7
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా మూడోవారంలోకి ఎంటరైంది. మూడోవారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగింది. ఈ వారం ఎలిమినేషన్‌కు 8 మంది నామినేట్ కాగా ఇందులో నుండి ఎవరు బయటకు వస్తారో చూడాలి.

తొలుత ‘ట్రాష్ బిన్’ (చెత్త బుట్ట) థీమ్ పెట్టారు. ఈ ఇంట్లో ఉండేందుకు ఎవరు అనర్హుుల అని మీరు భావిస్తారో ఆ వేస్ట్‌ను త్వరగా బయటికి పంపండి అని చెప్పారు. చీఫ్‌లు అభయ్, నిఖిల్‌ను ఎవరూ నామినేట్ చేయకూడదంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారు ఆ వ్యక్తిపై చెత్త పోసి రీజన్ చెప్పాలన్నారు.

తొలుత సీతతో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సీత ముందుగా యష్మీని నామినేట్ చేసింది. గేమ్స్‌లో డామినేటింగ్‌గా, చీఫ్‌గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నట్లు అనిపించిందంటూ యష్మీని నామినేట్ చేసింది. ఆ తర్వాత నీ అగ్రెషన్ నాకు అసలు నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. విష్ణు ప్రియ..తొలుత ప్రేరణను ఆ ఆ తర్వాత యష్మీని నామినేట్ చేసింది. ఈ సందర్భంగా విష్ణుప్రియ – ప్రేరణ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

మణికంఠ..యష్మీ, పృథ్వీని నామినేట్ చేశాడు. చీఫ్‌గా ఉన్నప్పుడు పక్షపాతంగా ఉన్నావ్.. అలానే ప్రతి పనిలోనూ కావాలని చేస్తున్నారా లేదా అంటూ దూరిపోయావ్ అని యష్మీని నామినేట్ చేసే సందర్భంగా తెలిపాడు మణికంఠ. దీంతో కోపంతో మణిపై గట్టిగా అరిచింది యష్మీ. ఆ తర్వాత అగ్రెషన్ రీజన్‌తో పృథ్వీని నామినేట్ చేశాడు.

Also Read:Bigg Boss 8 Telugu: శేఖర్ బాషా ఎలిమినేట్

ప్రేరణ తొలుత సీతను ఆ తర్వాత విష్ణుప్రియను నామినేట్ చేసింది. విష్ణు ప్రియ నామినేట్ సందర్భంగా సిల్లీ రీజన్ చెప్పింది ప్రేరణ. రాత్రి పక్కన పెట్టిన ఐదు గుడ్లలో నువ్వు రెండు ఎగ్స్ తినేశావ్ అంటూ నామినేషన్ వేసింది. తర్వాత ఆదిత్య.. విష్ణుప్రియ, మణికంఠలను నామినేట్ చేయగా నైనిక.. సోనియా, ప్రేరణలను నామినేట్ చేసింది. యష్మీ.. మణికంఠ,నైనికను, నబీల్.. యష్మీ, ప్రేరణలను…పృథ్వీ.. సీత, నైనికలను నామినేట్ చేశాడు.

మొత్తంగా ఈ వారం నామినేషన్‌లో 8 మంది ప్రేరణ, నైనిక, పృథ్వీ, మణికంఠ, విష్ణుప్రియ, సీత, యష్మీ, అభయ్ ఉండగా వీరిలో అత్యధికంగా యష్మీకి 5 ఓట్లు పడ్డాయి

- Advertisement -