Bigg Boss 8 Telugu: కంటతడి పెట్టించిన బిగ్ బాస్..

10
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజయవంతంగా 12 రోజులు పూర్తి చేసుకుంది. ఇక రెండోవారం ఎలిమినేషన్ లో భాగంగా ఎవరు ఇంటి నుండి బయటకు వెళ్తారు అనేది రెండు రోజుల్లో తేలనుండగా తాజా ఎపిసోడ్‌లో హార్ట్ టచింగ్ లవ్‌స్టోరీలతో ఆకట్టుకున్నారు ఇంటి సభ్యులు.

టాస్క్‌లు ముగిసిన తర్వాత లవ్ టాపిక్‌గా ఆసక్తికర సంభాషణ జరిగింది. సోనియాకి అభయ్, ప్రేరణకి నిఖిల్ సలహాలు ఇచ్చారు. హౌస్‌లో ఉన్న మూడు టీముల్లోకి ‘కెరటం’ (నిఖిల్) టీమ్ అత్యధికంగా ప్రైజ్ మనీ గెలిచింది. దీంతో వాళ్లు గెలిచిన రూ.2 లక్షల 50 వేలు,విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ చేశాడు బిగ్‌బాస్. దీంతో మొత్తం ప్రైజ్ మనీ విలువ రూ. 5 లక్షల 45 వేలకి చేరింది.

తర్వాత స్పిన్ ది బాటిల్ అనే గేమ్ పెట్టాడు బిగ్ బాస్. దీని ప్రకారం బాటిల్ ఎవరి వైపు చూపిస్తే వాళ్లు ట్రూత్ ఆర్ డేర్ ఏదో ఒకటి ఎంచుకోవాలి. ముందుగా యష్మీ వంతురాగా బిగ్‌బాస్‌కి వచ్చిన తర్వాత నువ్వు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి.. ఏదైనా దొంగతనం చేసి చేయలేదని కూడా చెప్పుండొచ్చు అంటూ శేఖర్ బాషా బాగా ఇరికించాడు. చికెన్ దొంగతనం చేసి చేయలేదంటూ విష్ణుతో గొడవ పడ్డా అంటూ చెప్పింది. తర్వాత విష్ణుప్రియ పోల్ డ్యాన్స్ చేయాలంటూ మణి డేర్ ఇవ్వగా అదరగొట్టింది. ఇక ముఖ్యంగా నిఖిల్ అమ్మాయిలా చీర కట్టుకొని డ్యాన్స్ ఇరగదీశాడు.

తర్వాత కంటెస్టెంట్లను ఎమోషన్స్‌తో ఏడిపించాడు బిగ్‌బాస్. హౌస్‌లోకి వచ్చి రెండు వారాలు అయింది.. మీకిష్టమైన వారిని మిస్ అవుతున్నారని బిగ్‌బాస్‌కి తెలుసు.. వారి జ్ఞాపకాలను మీతో ఉంచుకునే అవకాశం ఉంది. ఇందుకు ఐదుగురు సభ్యులకి అవకాశం ఇస్తున్నాం అని తెలిపాడు బిగ్ బాస్. ముందుగా అభయ్, నిఖిల్ గిఫ్ట్స్ చూపించాడు బిగ్‌బాస్. నిఖిల్‌కి వాళ్ల నాన్న షర్ట్ గిఫ్ట్ రాగా.. అభయ్‌కి వాళ్ల నాన్న వాచ్ తెప్పించాడు బిగ్‌బాస్. వీరిద్దరిలో అభయ్‌కి గిఫ్ట్ దక్కింది. ఆ తర్వాత నిఖిల్ దగ్గర సోనియా ఎమోషన్ అయింది. నిఖిల్ ఒడిలో పడుకొని తెగ ఏడ్చింది సోనియా.

తర్వాత నబీల్, పృథ్వీ గిఫ్ట్‌లు రాగా నాన్నతో కలిసి తీసుకున్న చివరి ఫోటో ఇది అంటూ నబీల్ చెప్పాడు. కరోనా సమయంలో నాన్న చనిపోయారు..అంటూ ఎమోషన్ అయ్యాడు. చివరిగా మణికంఠకి అమ్మమ్మ శాలువా.. ఆదిత్యకి వాళ్ల నాన్న ఫొటో గిఫ్ట్‌గా వచ్చింది. అయితే అప్పటికే మణికంఠ దగ్గర వాళ్ల అమ్మ స్వెటర్ ఉండటంతో అంతా ఆదిత్యకి లాలిపాప్స్ ఇచ్చారు. ఇక తన నాన్న గురించి చెబుతూ ఆదిత్య బాగా ఎమోషనల్ అయ్యాడు.

- Advertisement -