Bigg Boss 8 Telugu: పాలకూర బజ్జీలకు బిగ్ బాస్ ఫిదా

0
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 8 తెలుగు విజయవంతంగా 101 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా తొలుత అవినాష్ – నబీల్ కలిసి పాలకూర బజ్జీలు వేశారు. బిగ్‌బాస్‌కి ప్రేమతో ఆ బజ్జీలను పంపించారు . స్టోర్ రూమ్‌లో పెట్టిన ఈ బజ్జీలను బిగ్ బాస్ లాగించేసి ఒక చిన్న నోట్‌ని రాసి పంపించాడు. బజ్జీలు చాలా బాగున్నాయ్.. కానీ మరీ తక్కువ ఉన్నాయ్ అని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ బజ్జీలు వేసి పంపిస్తే అవికూడా సరిపోలేదంటూ మళ్లీ చీటీ రాసి పంపించాడు బిగ్‌బాస్.

ఆ తర్వాత ‘వంటలక్క’ సీరియల్ బ్యాచ్ హౌస్‌మేట్స్‌తో కలిసి ఫన్నీ ముచ్చట్లు పెట్టారు. అందులో కూడా అవినాష్ ఉన్నాడు కాబట్టి ఏదో అలా కామెడీ నడిచిపోయింది.వచ్చిన జంటతో పోటీ పడి గెలిస్తే ప్రైజ్ మనీకి రూ.10వేల 928 యాడ్ అవుతాయంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో వీళ్లతో ప్రేరణ, అవినాష్ గేమ్ ఆడాల్సి వచ్చింది. ఈ టాస్క్‌లో ప్రేరణ-అవినాష్ గెలవగా ప్రైజ్‌మనీకి రూ. 10 వేలు యాడ్ అయ్యాయి.

ఆ తర్వాత ప్రేరణ, నబీల్, అవినాష్ కలిసి ఇంకా బజ్జీలు చేసి పెద్ద బౌల్‌లో పెట్టి బిగ్‌బాస్ కోసం స్టోర్ రూమ్‌కి వెళ్లారు. అయితే డోర్ ఓపెన్ చేయగానే అక్కడ పిజ్జాలు, కూల్ డ్రింక్స్ కనిపించాయి. చాలా రోజుల తర్వాత పిజ్జాలు కనిపించడం, బిగ్‌బాస్ ఇంత ప్రేమ చూపించడంతో ప్రేరణకి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

Also Read:ఈ వివాదానికి కారణం వినయ్‌: మనోజ్

కొంచెం సేపటి తర్వాత ‘మగువా ఓ మగువా’ సీరియల్ నుంచి హీరోహీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వీరితో ఇంటి సభ్యులకు ఓ గేమ్ ఆడించగా ఇందులో ప్రేరణ- గౌతమ్ గెలిచారు. దీంతో రూ.10 వేల 10 ప్రైజ్ మనీకి యాడ్ అయింది.

- Advertisement -