Bigg Boss 7 Telugu:ఇది కదా బిగ్ బాస్‌కి కావాల్సింది

29
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా నాలుగో వారంలోకి ఎంటరైంది. ఇక నాలుగో వారం ఎలిమినేషన్‌కు 6 గురు నామినేట్ కాగా వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇక నాలుగోవారం నామినేషన్ సందర్భంగా ప్రిన్స్ యావర్- గౌతమ్ కృష్ణ మధ్య వాగ్వాదం జరిగింది. ఎవరు తగ్గెదేలే అంటూ మాటల తూటాలతో రెచ్చిపోయారు.

ఈసారి నామినేషన్ ప్రక్రియలో ఒక్కొక్క కంటెస్టెంట్‌ ఇద్దరినీ నామినేట్ చేస్తారు. అయితే అందులో ఎవరి నామినేషన్‌తో జ్యూరీ మెంబర్స్ కన్విన్స్ అవుతారో వాళ్ల ఫొటోని మాత్రమే నామినేటెడ్ అంటూ గిల్టీ బోర్డ్‌పై ఉంచాతారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఒకసారి గిల్టీ బోర్డ్‌కి ఎక్కిన వ్యక్తిని వేరొకరు నామినేట్ చేయడానికి వీల్లేదు. దీంతో నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరిగింది.

Also Read:ఆమె అందాలకు ఎంతైనా ఇవ్వొచ్చు అట!

ఇందుకు సంబంధించిన ప్రొమోలో పాత గొడవను మళ్లీ లాగుతూ గౌతమ్.. యావర్‌ను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరూ రెచ్చిపోయారు. తూ క్యారే అంటూ నా మీదకి వచ్చాడు యావర్ అంటూ గౌతమ్ చెప్పాడు. దీనికి అవును అది నా ఆటిడ్యూడ్ అంటూ యావర్ సమాధానమివ్వడంతో గౌతమ్ కూడా రెచ్చిపోయాడు. ఒకరినొకరు మాట జారే వరకు పరిస్థితి వెళ్లింది. ఓ దశలో ఇద్దరు కొట్టుకుంటారేమో అని అనిపించగా వెంటనే శివాజీ.. యావర్‌పైన అరిచి ముందు నువ్వు నీ ప్లేసుకు వెళ్లు.. ఇది కాదు నీ ప్లేస్ అంటూ అనడం ప్రొమోలో కనిపించింది. ఇక ఈ ప్రొమో చూసిన నెటిజన్లు బిగ్ బాస్‌కు కావాల్సింది ఇదేనని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:టీమిండియా జోరు కొనసాగేనా?

- Advertisement -