Bigg Boss 7 Telugu:ఈ వారం డబుల్ ఎలిమినేషన్!

26
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా నాలుగోవారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో ఆరుగురు ప్రిన్స్ యావర్, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక, టేస్టీ తేజా, రతికలు ఉన్నారు. సాధారణంగా ఎలిమనేషన్‌లో భాగంగా ఒకరు హౌస్ నుండి బయటకు రానుండగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది.

డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న టేస్టి తేజాతో పాటు రతిక బయటకు రానున్నారు. గురువారం వరకూ ప్రిన్స్ యావర్ టాప్‌లో ఉండగా అనూహ్యంగా గౌతమ్ కృష్ణ టాప్‌లోకి వచ్చాడు. ఇద్దరి మధ్య ఓటింగ్ పరంగా తక్కువ వ్యత్యాసమే ఉంది. మూడో స్థానంలో శుభశ్రీ ఉండగా ప్రియాంక జైన్ నాలుగో స్థానంలో ఉంది.

ఇక ఈవారం ఓటింగ్‌లో తొలిరోజు నుంచి లీస్ట్‌లో ఉన్న టేస్టీ తేజా, రతికలు డేంజర్‌లో ఉన్నారు. వీళ్లిద్దరూ ఎలిమినేషన్‌కి నువ్వా నేనా? అని పోటీపడుతుండగా ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే టేస్టి తేజా, డబుల్ ఎలిమినేషన్ ఉంటే తేజాతో పాటు రతిక ఇంటి నుండి బయటకు రానున్నారు. ఒక వేళ సింగిల్ ఎలిమినేషన్‌ ఉండి రతిక బయటకు వస్తే హౌస్‌కు పట్టిన దరిద్రం పోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్న పరిస్థితి. ఉల్టా పల్టా సీజన్ కావడంతో ఏదైనా జరగొచ్చు అని పలువురు చెబుతున్నారు.

Also Read:ప్రజాకవి అలిశెట్టి కుటుంబానికి అండగా ప్రభుత్వం..

- Advertisement -