Bigg Boss 7 Telugu:చెత్తసంచాలక్‌తో గెలిచిన శోభా

35
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 19 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా సందీప్ చెత్త సంచాలక్‌తో గౌతమ్‌కి అన్యాయం జరుగగా శోభాశెట్టి గెలుపొందింది. తొలుత శోభాశెట్టి యాక్టివిటీ ఏరియాలోకి పిలిచిన బిగ్ బాస్.. ఆమెకు పవరాస్త్ర పోటీదారులుగా నిలవడానికి ఓ టాస్క్ ఇచ్చారు. బౌల్ నిండా చికెన్ పీస్‌లు పెట్టి తినమని చెప్పగా కారం దట్టించిన లెగ్‌ పీస్‌లను లాగించేసింది. తర్వాత కారం నషాళానికి అంటగా ఆమె పడ్డ బాధ వర్ణణాతీతం. తర్వాత ఈ హౌస్‌లో మాస్క్ వేసుకుని ఆడుతున్నదెవరు? అని శోభానే అడిగారు బిగ్ బాస్.

మొత్తం 45 లెగ్ పీస్‌లు ఇవ్వగా శోభా 27 లెగ్ పీస్‌లను తిన్నది. ఆ తరువాత ప్రశాంత్, శుభ శ్రీ, గౌతమ్‌లకు సేమ్ టాస్క్ ఇచ్చారు. ఇక ప్రశాంత్ లొట్టలేసుకుని తినేస్తుండటంతో.. వాడు తినేస్తాడు నాకు తెలుసు.. నాకు తెలుసు అని శోభాశెట్టి ఏడుపు స్టార్ట్ చేసింది. అందరికంటే ముందు గౌతమ్ తినేశాడు. ఆ తరువాత ప్రశాంత్, సుబ్బు కూడా ముక్కలన్నీ లాగించేశారు. అందరికంటే ముందు బెల్ మోగించాడు. అయితే సంచాలకుడిగా ఉన్న సందీప్‌ని ముందు ఎవరు తిన్నారని బిగ్ బాస్ అడగ్గా గౌతమ్ అని చెప్పాడు.

Also Read:రక్షిత్ అట్లూరి…నరకాసుర

ఇక బయటకు వచ్చిన తరువాత.. చిన్న ముక్క వదిలేశావ్ అని మెలిక పెట్టాడు సందీప్. అదేదో అక్కడే చెప్తే.. ఆ ముక్కని కూడా కంప్లీట్ చేసేవాడ్ని కదా అని గౌతమ్ అంటే.. నిజమే కదా.. ఆ మాట నువ్వు లోపలే చెప్పాలి శివాజీ చెప్పారు. చివరికి శోభా, గౌతమ్‌లు 27 పీస్‌లు తిన్నారని సందీప్ చెప్పడంతో ఇద్దరికీ టై అయ్యింది. అయితే చివర్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.. శోభా తిన్నది 27 పీస్‌లుకాబట్టి.. దాన్ని క్రాస్ చేయాలంటే.. 28 తినాలి.. కాబట్టి.. ఈ టాస్క్‌లో శోభానే విజేత అని ప్రకటించారు బిగ్ బాస్.అయితే వాస్తవానికి గౌతమ్ తిన్నది 28 పీస్‌లు. కానీ ఒక పీస్‌లో చిన్న ముక్క వదిలేశాడని.. 27 అని ఒకటి తగ్గించి చెప్పాడు ఆట సందీప్.దీంతో సందీప్ – గౌతమ్ మధ్య వాగ్వాదం జరిగింది.

Also Read:టీడీపీ రూట్ మ్యాప్.. పవన్ చేతిలో?

- Advertisement -