బిగ్‌బాస్ : రతిక రెమ్యునరేషన్ ఎంత?

16
- Advertisement -

బిగ్‌బాస్ సీజన్-7లో నాలుగోవారం ఎలిమినేషన్ పూర్తయ్యింది. ముందు నుంచి సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం రతిక ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. కాగా, 4వ వారంలోనే హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన రతిక రెమ్యునరేషన్‌ మాత్రం గట్టిగానే తీసుకుందట. ప్రతివారం రూ.2 లక్షల(రోజుకు రూ.28వేలు) చొప్పున మొత్తం నాలుగు వారాలకు కలిపి రూ. 8 లక్షల పారితోషికం అందుకుందట. దీంతో ఇంత త్వరగా ఎలిమినేట్‌ అయినా రతిక రెమ్యునరేషన్‌ బాగానే అందుకుందని చెప్పుకుంటున్నారు నెటిజన్లు.

ఎలిమినేషన్ అనంతరం రతిక మాట్లాడుతూ.. తనకు అంతా కలలాగా ఉందని, ఎలిమినేట్ అవుతానని ఊహించలేదని చెప్పింది. ఆ తర్వాత నాగార్జున.. కంటెస్టెంట్స్ అందరిలో నచ్చని లక్షణాన్ని చెప్పమనడంతో, ఎవరిపై ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో రతిక బయటపెట్టింది. ఈ అభిప్రాయాల్లో కూడా ఆమె నిజాయితీగా లేకపోవడంతో ఆమె పై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు.

ఇక ఓ ఇంటర్వ్యూలో రతిక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ నటుల్లో ఎవరిపైనైనా క్రష్ ఉందా? అని అడగ్గా.. మహేష్ బాబు అని చెప్పుకొచ్చింది. లక్కీగా తనకు టాలీవుడ్ లో గుర్తింపు వచ్చే ఉందని.. అలాగే తనకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం రావడం ఆనందంగా ఉందని.. భవిష్యత్తులో తెలుగు ప్రాజెక్ట్‌లు చేయాలని కోరికగా ఉందని రతిక చెప్పుకొచ్చింది.

Also Read:తెలంగాణ మోడల్..అక్షర చిహ్నం

- Advertisement -