బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 4వ వారం పూర్తిచేసుకుంది. ఇక నాలుగోవారం ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న రతిక ఇంటి నుండి ఎలిమినేట్ అయింది. నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా చివరికి టేస్టి తేజా , రతిక మిగలగా చివరికి రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు నాగ్. ఇక స్టేజీ మీదకు వచ్చిన రతిక కన్నీటి పర్యంతం అయింది. ఇదొక పాఠం.. బయటకు వెళ్లిన తరువాత అబ్జర్వ్ చేసుకో.. నువ్వు చాలా యంగ్.. నీ జర్నీ చూద్దాం నాగ్ చెప్పారు.
అటు ప్రశాంత్‌తో ఇటు యావర్‌తో పాట నడిపిన ప్రేమ కలాపాలను కళ్ల ముందు ఉంచేసరికి రతిక ముఖంలో రక్తం చుక్కలేదు. వీడియో మొత్తంలో వెన్నుపోట్లు, లవ్ ట్రాక్ తప్ప ఏమి లేదు. ఏం రతికా హౌస్‌లోకి బ్రోకెన్ హార్ట్‌తో వెళ్లావ్ ఇప్పుడు ఫుల్ హార్ట్‌తో వచ్చావా? అని అడిగారు. నాకు రావాలని అనిపించలేదు సార్.. బాధగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంది. అందర్నీ సమానంగా చూడాలని శివాజీకి సలహా ఇవ్వగా సంచాలక్‌గా సందీప్ ఫెయిల్ అయ్యాడని చెప్పింది. శోభాశెట్టిని ఎప్పుడూ రెడీ అవడం కాదు.. ఇంట్లో పనులు కూడా చెయ్ అని చెప్పింది. తేజాకి కూడా పనులు చేయమని సలహా ఇచ్చింది. ఎక్కడా ప్రశాంత్ ప్రస్తావన తీసుకురాలేదు.
Also Read:విచారణకు రెడీ.. తాడో పేడో?